వర్షాకాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టే ఆహార పదార్థాలివే..?

మన శరీరానికి ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంది. కొన్ని పండ్లు కొన్ని సీజన్లలో మాత్రమే లభ్యమవుతాయి. ఆ సీజన్ లో దొరికే పండ్లు, ఆహారం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. కాలానికి అనుగుణంగా తినేవారు వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి. శరీరానికి తగిన శక్తిని, రోగనిరోధక శక్తిని ఆహారం అందిస్తుంది. పోషకాలు అధికంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకుంటే మంచిదని పోషకాహార నిపుణులు ఉంటారు. […]

Written By: Navya, Updated On : June 25, 2021 9:16 pm
Follow us on

మన శరీరానికి ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంది. కొన్ని పండ్లు కొన్ని సీజన్లలో మాత్రమే లభ్యమవుతాయి. ఆ సీజన్ లో దొరికే పండ్లు, ఆహారం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. కాలానికి అనుగుణంగా తినేవారు వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి. శరీరానికి తగిన శక్తిని, రోగనిరోధక శక్తిని ఆహారం అందిస్తుంది.

పోషకాలు అధికంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకుంటే మంచిదని పోషకాహార నిపుణులు ఉంటారు. వర్షాకాలంలో మొక్కజొన్న తీసుకుంటే మంచిది. మొక్కజొన్న ఫైబర్ ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. మొక్కజొన్నలో లుటిన్ మరియు ఫైటోకెమికల్స్ ఉండటంతో పాటు కేలరీలు తక్కువగా ఉంటాయి. మొక్కజొన్న బరువు తగ్గించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వర్షాకాలంలో బొప్పాయి పండు తింటే మంచిది.

ఆపిల్‌, దానిమ్మలను ఎక్కువగా తింటే తక్షణమే శక్తి వస్తుంది. అల్లం, మిరియాలు, తేనె, పుదీనాతో తయారు చేసిన హెర్బల్‌ టీలు తాగితే అందులో ఉండే బ్యాక్టీరియల్ గుణాలు శరీరానికి మేలు చేస్తాయి. ముల్లంగి రసాన్ని తాగితే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. మొక్కజొన్న, శనగపిండి, శనగలతో చేసిన ఆహారం తీసుకుంటే మంచిది. బ్రౌన్‌రైస్‌, ఓట్స్‌, బార్లీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి.

వెల్లుల్లిని సూప్‌లలో, కూరలలో విధిగా వెల్లుల్లి వేయడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో అరటిపండ్లు తినడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. అరటిపండ్లు తక్కువ కేలరీలను కలిగి ఉండి కడుపు ఎక్కువ సమయం నిండుగా ఉండటంలో తోడ్పడుతుంది.