జియోఫోన్ నెక్ట్స్ ఫీచర్లు ఇలా ఉండొచ్చట.. అతి తక్కువ ధరలో..?

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ముఖేష్ అంబానీ కొన్నేళ్ల క్రితం జియో ఫీచర్ ఫోన్ ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఫీచర్ ఫోన్ వినియోగదారులలో ఎక్కువమంది ఈ ఫోన్ ను వినియోగిస్తున్నారు. తాజాగా జరిగిన 44 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేశ్ అంబానీ జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్టు కీలక ప్రకటన చేశారు. గూగుల్, రిలయన్స్ జియో సంయుక్తంగా ఈ ఫోన్ ను అభివృద్ధి చేశాయి. వినాయక చవితి నుంచి […]

Written By: Kusuma Aggunna, Updated On : June 25, 2021 9:12 pm
Follow us on

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ముఖేష్ అంబానీ కొన్నేళ్ల క్రితం జియో ఫీచర్ ఫోన్ ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఫీచర్ ఫోన్ వినియోగదారులలో ఎక్కువమంది ఈ ఫోన్ ను వినియోగిస్తున్నారు. తాజాగా జరిగిన 44 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేశ్ అంబానీ జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్టు కీలక ప్రకటన చేశారు. గూగుల్, రిలయన్స్ జియో సంయుక్తంగా ఈ ఫోన్ ను అభివృద్ధి చేశాయి.

వినాయక చవితి నుంచి మన దేశంలో ఈ స్మార్ట్ ఫోన్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫోన్ ఫీచర్ల గురించి అధికారికంగా ప్రకటన రాకపోయినా సోషల్ మీడియాలో ఫోన్ గురించి కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. 8 జీబీ మెమొరీ, 1 జీబీ ర్యామ్ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. తక్కువ సిపియు క్లాక్ స్పీడ్‌తో ఎంట్రీ లెవల్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో ఈ ఫోన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ప్రత్యేకమైన మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్‌తో ఈ ఫోన్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఫోన్ 12 ఎంపీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంటుందని సమాచారం. టచ్ స్క్రీన్ తోనే ఉండే ఈ ఫోన్ కు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉండనుందని తెలుస్తోంది. మెయిన్ కెమెరా 1080p వీడియో రికార్డింగ్, పోర్ట్రెయిట్ మోడ్, మరిన్ని ఫీచర్లను అందించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఈ ఫోన్ జియో సిమ్ తో మాత్రమే పని చేస్తుందని తెలుస్తోంది. ఇతర నెట్వర్క్ లను ఈ ఫోన్ సపోర్ట్ చేయదని సమాచారం. గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఫోన్ లో ఉంటుందని ఈ ఫోన్ లో గూగుల్ ప్రపంచ స్థాయి భద్రత మరియు మాల్వేర్ రక్షణను కలిగి ఉంటుందని తెలుస్తోంది. వేర్వేరు రంగుల్లో 5,000 నుంచి 6,000 రూపాయల ధరలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుందని సమాచారం.