https://oktelugu.com/

వైరల్: విరబూసిన ‘పూనమ్’ అందాలు

పూనమ్ బజ్వా.. అందం, అభినయం ఉన్న ఈ నటి ఇప్పుడు అవకాశాలు లేక సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తోంది. మంచి అందం, అభినయం ఉన్నా టాలీవుడ్‌లో అంతగా సక్సెస్‌ సాధించలేకపోయిన నటి పూనమ్‌ బజ్వా. 2005లో ‘మొదటి సినిమా’తో టాలీవుడ్‌తోనే తెరంగేట్రం చేసింది. ఈ ముంబై భామ అప్పట్లో తన అంద చందాలతో యూత్‌ను తెగ ఆకట్టుకుంది. ‘ప్రేమంటే ఇంతే’, ‘బాస్‌’, ‘వేడుక’, ‘పరుగు’ చిత్రాలు చేసిందామె. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళ్‌, ఆపై […]

Written By:
  • NARESH
  • , Updated On : June 25, 2021 / 10:32 PM IST
    Follow us on

    పూనమ్ బజ్వా.. అందం, అభినయం ఉన్న ఈ నటి ఇప్పుడు అవకాశాలు లేక సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తోంది. మంచి అందం, అభినయం ఉన్నా టాలీవుడ్‌లో అంతగా సక్సెస్‌ సాధించలేకపోయిన నటి పూనమ్‌ బజ్వా. 2005లో ‘మొదటి సినిమా’తో టాలీవుడ్‌తోనే తెరంగేట్రం చేసింది. ఈ ముంబై భామ అప్పట్లో తన అంద చందాలతో యూత్‌ను తెగ ఆకట్టుకుంది.

    ‘ప్రేమంటే ఇంతే’, ‘బాస్‌’, ‘వేడుక’, ‘పరుగు’ చిత్రాలు చేసిందామె. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళ్‌, ఆపై మళయాల సినిమాలతో బిజీగా మారింది. టాలీవుడ్‌కు దూరమైన ఆమె తమిళ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. కానీ, ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది.

    ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో ఓ గెస్ట్‌ రోల్‌ చేసింది. వయసు మీద పడడంతో ఈ మద్య కాలంలో ఏ భాషలోనూ ఆమెకు చాన్స్‌లు రావడం లేదు. దాంతో, ఎలాగైనా లైమ్‌ లైట్‌లోకి రావాలని ప్రయత్నిస్తున్న పూనమ్‌ ఓ డేరింగ్‌‌ స్టెప్‌ వేస్తోంది.

    పూనమ్ బజ్వా తాజాగా పింక్ సారీలో లేలేత అందాలతో జారిపోతున్న కురులతో ప్రియుడి కోసం ఆశగా చూస్తున్నట్టు ఓర చూపులు చూస్తూ అలరించింది. ఆమె ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.