
Actor Hema: ఒడ్డు పొడుగు కలిగిన హేమ హీరోయిన్ మెటీరియల్ అని చెప్పొచ్చు. అయితే కెరీర్ బిగినింగ్ నుండి సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి. హీరో, హీరోయిన్ సిస్టర్స్ తరహా పాత్రలు ఎక్కువగా చేశార. 80లలోనే హేమ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 2000 తర్వాత ఆమె లేడీ కమెడియన్ అవతారం ఎత్తారు. మహేష్-త్రివిక్రమ్ ల ‘అతడు’ ఆమెకు మంచి పాపులారిటీ తెచ్చింది. బ్రహ్మానందం భార్య పాత్రలతో ఫేమస్ అయిన వారిలో హేమ కూడా ఒకరు. వీరి కాంబినేషన్ కూడా బాగానే సెట్ అయ్యింది. మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగి ఉంది.
Also Read: NTR 30: ఎన్టీఆర్ 30పై ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్!
హేమ ఫైర్ బ్రాండ్ కూడాను. 2021లో జరిగిన మా మూవీ అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ తరపున పోటీ చేశారు. ఎన్నికల రోజు అక్కడ కొన్ని గొడవలు చోటు చేసుకున్నాయి. మంచు విష్ణు ప్యానల్ సభ్యుడైన శివబాలాజీ చేయి కొరికి హేమ వార్తలకు ఎక్కింది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న హేమ ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. ఆమె మొదటి వారమే ఎలిమినేట్ అయ్యారు. మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించిన హేమ ఈ మధ్య కాలంలో సిల్వర్ స్క్రీన్ మీద కనిపించడం లేదు. అందుకు కారణాలు ఏమిటో స్వయంగా వెల్లడించారు.
కిరాక్ ఆర్పీ మణికొండలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశాడు. ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. హేమ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… నేను వేరే వ్యాపారం పెట్టాను. అందులో బాగా లాభాలు వస్తున్నాయి. సుఖపడటానికి అలవాటు పడ్డాను. అందుకే సినిమాలు చేయడం లేదని క్రేజీ ఆన్సర్ ఇచ్చింది. ఇక హేమ చేస్తున్న వ్యాపారం ఏమిటనేది చెప్పలేదు. దీంతో అంత ఘనంగా డబ్బులు తెచ్చిపెడుతున్న వ్యాపారం ఏమిటో మాకు చెప్పమని అడుగుతున్నారు.

2021 వరకు హేమ సిల్వర్ స్క్రీన్ పై యాక్టివ్ గానే ఉన్నారు. రకుల్-వైష్ణవ్ తేజ్ జంటగా నటించిన కొండపొలం మూవీలో హేమ నటించారు. అదే ఏడాది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? చిత్రం కూడా చేశారు. ఆహా ఒరిజినల్ మూవీ 3 రోజెస్ లో కనిపించారు. హేమకు ఒక అమ్మాయి. భర్త పేరు సయ్యద్ జాన్ మహమ్మద్. ఆమె మతాంతర వివాహం చేసుకున్నారు.
Also Read: Ananya Nagella’s Instagram photos : జాకెట్ వేసుకోకుండా మొత్తం విప్పి చూపించిన పవన్ కళ్యాణ్ హీరోయిన్