Health Tips: మెట్లు ఎక్కి, దిగితే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలంటే..

లిఫ్ట్ కు స్వస్తి పలికి, ఎక్స్ క వేటర్ కు గుడ్ బై చెబితే మెట్లు ఎక్కి, దిగితే ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇంతకీ మెట్లు ఎక్కి దిగితే ఎలాంటి ఉపయోగం ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం.

Written By: Anabothula Bhaskar, Updated On : May 21, 2024 2:45 pm

health benefits of climbing stairs up and down

Follow us on

Health Tips: ఒకప్పుడు మనుషులకు శారీరక వ్యాయామం ఉండేది. ఇన్ని ప్రయాణ సాధనాలు లేవు కాబట్టి, దగ్గరి ప్రాంతాలకు నడిచే వెళ్లేవారు. దానివల్ల శరీరం శ్రమకు గురయ్యేది. ఫలితంగా ఒంట్లో కాలరీలు ఖర్చయ్యేవి. దానివల్ల మధుమేహం , ఊబకాయం వంటి వ్యాధులు వచ్చేవి కావు. కానీ ఇప్పుడలా కాదు.. చిన్న పనికి కూడా బైక్ వాడటం.. పై అంతస్తుకు వెళ్లాలంటే లిఫ్టు ఉపయోగించడం, ఎక్స్ క వెటర్ మీద ఆధారపడటం పరిపాటిగా మారింది. వీటివల్ల శారీరక శ్రమ లేకపోవడంతో చాలామంది ఊబకాయం లేదా మధుమేహానికి గురవుతున్నారు. ఇలాంటి క్రమంలో లిఫ్ట్ కు స్వస్తి పలికి, ఎక్స్ క వేటర్ కు గుడ్ బై చెబితే మెట్లు ఎక్కి, దిగితే ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇంతకీ మెట్లు ఎక్కి దిగితే ఎలాంటి ఉపయోగం ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం.

గుండెకు మంచిది

మెట్లు ఎక్కి దిగడం వల్ల గుండె రక్త ప్రసరణ వ్యవస్థకు మంచిదట. ఇది హృదయానికి వ్యాయామాన్ని కలిగిస్తుందట. అంతేకాదు రక్తాన్ని మెరుగ్గా పంపింగ్ చేసేందుకు ఉపయోగపడుతుందట. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుందట.

కండరాలు బలపడతాయి

మెట్లు ఎక్కి దిగడం వల్ల కాళ్లల్లో కండరాలు బలపడతాయట. శరీరం బరువును మెట్లు ఎక్కేటప్పుడు ఎక్కువగా మోయాల్సిన అవసరం ఉండదట. అప్పుడు తక్కువ బలం ఉపయోగించాల్సి ఉంటుందట. దిగేటప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంటుందట. దానివల్ల కాళ్లు చురుకుగా ముందుకు కదులుతాయట. దీనివల్ల పిక్కల నుంచి మొదలు పెడితే తొడ వరకు కండరాలు బలపడతాయట.

కేలరీలు ఖర్చువుతాయి

మెట్లు ఎక్కి దిగడం వల్ల శరీరంలో కేలరీలు వెంటనే ఖర్చవుతాయట. ముఖ్యంగా పొట్ట, పిరుదుల భాగంలో ఉన్న చెడు కొవ్వు కరిగిపోయేందుకు ఆస్కారం ఉంటుందట.

ఓర్పు, సహనం పెరుగుతుంది

మెట్లు ఎక్కేటప్పుడు ఓర్పు అనేది కలుగుతుందట. దిగేటప్పుడు సహనం స్థాయి పెరుగుతుందట. ఏరోబిక్ వంటి వాటిని చేసిన దానికంటే ఎక్కువ ప్రయోజనం శరీరానికి లభిస్తుందట.

ఎముకల సాంద్రత పెరుగుతుంది

మెట్లు ఎక్కే వారిలో ఎముకల సాంద్రత పెరుగుతుందట. ఆస్టియోసోరిస్ అనే వ్యాధి బారిన పడే ప్రమాదం తగ్గుతుందట. ఎముకల ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయట.

మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది

మెట్లు ఎక్కడం వల్ల శారీరక శ్రమ పెరుగుతుందట. దీనివల్ల శరీరంలో ఎండార్పిన్, న్యూరో ట్రాన్స్మిటర్ లు విడుదలవుతాయట. ఫలితంగా మానసిక స్థితి సమతుల్యంగా ఉంటుందట. ఒత్తిడి అనేది తగ్గుతుందట. అంతేకాదు శరీరంలో కణజాలాలకు ఆక్సిజన్ స్థాయిని పెంచుతుందట. సహజమైన శక్తిని అందిస్తుంది. అలసటను నివారిస్తుందట.

పర్యావరణానికి మంచిది

మెట్లు ఎక్కి దిగడం వల్ల, లిఫ్ట్, ఎక్స్ క వేటర్లను వాడటం తగ్గిపోతుంది. దీనివల్ల విద్యుత్ ఆద అవుతుంది. అది పర్యావరణానికి మేలు చేస్తుంది. విద్యుత్ ను ఆదా చేస్తే ఆదా చేస్తే కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాటిని గాలిలోకి విడుదల చేయాల్సిన అవసరం ఉండదు. బొగ్గును మండించడం తగ్గుతుంది.