https://oktelugu.com/

Own House: సొంత స్థలం ఉంటే చాలు.. డబ్బులు లేకున్నా ఇలా సొంతిల్లు నిర్మించుకోండి.. ఐడియా తెలిస్తే షాక్ అవుతారు..

Own House: నేటి కాలంలో ప్రతి ఒక్కరి కల సొంతిల్లు కట్టుకోవడం. కానీ ఆ కల నెరవేరాలంటే లక్షల కొద్ది డబ్బు కావాలి. కాస్త లగ్జరీగా నిర్మించుకోవాలంటే కోట్లు కావాలి. దీంతో చాలా మంది స్థలాలు కొనుక్కున్నా.. ఇల్లు కట్టుకుందామనుకునేసరికి వాటికయ్యే బడ్జెట్ ను షాక్ అవుతన్నారు. నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో ఇంటి నిర్మాణ ఖర్చు కూడా విపరీతంగా పెరిగింది. అయితే కొందరు లోన్లు , అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నా.. ఈఎంఐలు కట్టలేక.. అప్పులు తీర్చలేక […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 21, 2023 / 01:30 PM IST
    Follow us on

    Own House

    Own House: నేటి కాలంలో ప్రతి ఒక్కరి కల సొంతిల్లు కట్టుకోవడం. కానీ ఆ కల నెరవేరాలంటే లక్షల కొద్ది డబ్బు కావాలి. కాస్త లగ్జరీగా నిర్మించుకోవాలంటే కోట్లు కావాలి. దీంతో చాలా మంది స్థలాలు కొనుక్కున్నా.. ఇల్లు కట్టుకుందామనుకునేసరికి వాటికయ్యే బడ్జెట్ ను షాక్ అవుతన్నారు. నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో ఇంటి నిర్మాణ ఖర్చు కూడా విపరీతంగా పెరిగింది. అయితే కొందరు లోన్లు , అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నా.. ఈఎంఐలు కట్టలేక.. అప్పులు తీర్చలేక నానా కష్టాలు పడుతున్నారు. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా.. మీ జేబుల్లో నుంచి పైసా పెట్టుబడి పెట్టకుండా మీరు ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు.. అంతేకాకుండా మీరు కావాలనుకున్న స్టైల్లో నిర్మించుకోవచ్చు. వినడానికి వినూత్నంగా ఈ విషయం గురించి తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండరు. మరి దాని గురించి తెలుసుకోవాలంటే కిందికి వెళ్లండి..

    సింపుల్ గా ఇల్లు కట్టుకుందామనుకున్నా.. కనీసం రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు వ్యయం అవుతుంది. దీంతో చాలా మంది ఇంటినిర్మాణానికి ఖర్చు పెట్టుబదులు అద్దె ఇంట్లోనే ఉండి జీవితాన్ని గడపాలని అనుకుంటున్నారు. కానీ సొంతిల్లు ఉండాలనుకునేవారు అప్పులు చేసి నిర్మించుకుంటున్నారు. పలు కారణాలతో అప్పులకు అయ్యే వడ్డీలు కట్టలేక దానినే మళ్లి తిరిగి అమ్మేస్తున్నారు. మరికొందరు లోన్లు తీసుకున్నా ఈఎంఐల భారంతో తీవ్ర కష్టాలు పడుతున్నారు. దీంతో కొత్తిల్లు నిర్మాణాన్ని వాయిదా వేస్తున్నారు.

    ఇలాంటి తరుణంలో కొందరు ఇంజనీర్లు అద్భుతమైన ఐడియాలను ఇస్తున్నారు. మీకు సొంత స్థలం ఉంటే చాలు.. ఇంటి నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా కట్టకుండా సొంతింట్లో ఉంటారు అని చెబుతున్నారు. వారు చెబుతున్న ప్రకారం.. మీకు 200 చదరపు గజాల స్థలం ఉందనుకోండి. ఇందులో మీరు సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి కనీసం 30 నుంచి రూ.70 లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీనికి ప్రహరీ నిర్మించడానికే సగం వ్యయం అవుతుంది. సింగిల్ బెడ్ రూం వేసుకొని ఖాళీ స్థలం అలాగే వదిలేస్తే ఎందుకు పనికిరాదు.

    Own House

    అయితే కొందరు బిల్డర్లు మినిమం స్క్వేర్ ఫీట్లు కలిగిన స్థలాలను ఎంచుకుంటున్నారు. వాటిని వాళ్లు టేకాప్ చేసి ఇల్లు నిర్మిస్తున్నారు. ఉదాహరణకు మీ స్థలాన్ని బిల్డర్ కు అప్పగిస్తే 5 ఫ్లోర్లు నిర్మించారనుకోండి. అందులో మీరు ఒప్పందం చేసుకున్న ప్రకారం ఒకటి నుంచి మూడు ఫ్లోర్ల వరకు మీకు ఇస్తారు. మిగతా ఫ్లోర్లను అతను అమ్ముకుంటాడు. అయితే వాటికి వచ్చిన డబ్బును మాత్రం అతనే ఉంచుకుంటాడు. కానీ మీరు పెట్టుబడి పెట్టకుంటా మీకు ఫ్లోర్లు సొంతం అవుతాయి.ఈ ఐడియా గురించి తెలిసిన చాలా మంది ఇంటి నిర్మాణానికి ఆసక్తి చూపుతున్నారు.