Hardik Pandya: టీం ఇండియా గుజరాతీ కెప్టెన్ కాబోతున్నాడా.. బీసీసీఐ సంకేతం ఇచ్చిందా అంటే ఔవుననే సమాధానమే వస్తోంది క్రికెట్ వర్గాల నుంచి టీ20 ప్రపంచకప్ వైఫల్యం అనంతరం జట్టు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన బీసీసీఐ.. ముందుగా సెలెక్షన్ కమిటీపై వేటు వేసి కొత్త కమిటీ నియమకం చేపట్టింది. జనవరిలో కొత్త సెలెక్షన్ కమిటీ కొలువు దీరనుంది. తాజాగా టీమిండియాలో స్లి్పట్ కెప్టెన్సీని అమలు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. రోహిత్ శర్మ స్థానంలో హార్ధిక్ పాండ్యాకు టీ20 కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వాలనే యోచనలో బోర్డు ఉందనే ప్రచారం జరిగింది. రోహిత్‌శర్మ సైతం దీనికి సుముఖంగా ఉన్నాడని.. వచ్చే ఏడాది ఆరంభంలో శ్రీలంకతో సిరీస్‌కు ముందు అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.

కెప్టెన్సీతోపాటు కాంట్రాక్టు..
టీ20 కెప్టెన్సే కాకుండా వన్డే కెప్టెన్సీని కూడాహార్ధిక్ పాండ్యాకే అప్పగించాలని బీసీసీఐ భావిస్తోందని తాజా సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటికే బీసీసీఐ అధికారులు పాండ్యాకు చెప్పారని, అతను అంగీకరిస్తే.. రోహిత్ స్థానంలో వన్డే, టీ20ల్లో టీమిండియా కెప్టెన్‌గా హార్ధిక్‌ను నియమిస్తారని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. కెప్టెన్సీతోపాటు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులోనూ హార్ధిక్ పాండ్యాకు ప్రమోషన్ లభించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీ గ్రేడ్‌లో ఉన్న హార్ధిక్‌కు వచ్చే ఏడాది ఏ కాంట్రాక్టు ఇస్తారని తెలుస్తోంది. నూతన సెలక్షన్ కమిటీ ఏర్పాటు తర్వాతే బీసీసీఐ ఈ విషయాన్ని చర్చించే అవకాశం ఉంది. ‘మొత్తంగా బీసీసీఐ అధికారులు వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్సీని హార్దిక్‌కు ఇవ్వాలని అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి’ అని ఓ అధికారి మీడియాకు తెలిపారు.
రోహిత్‌కు రిటైరేనా..?
హార్దిక్‌కు టీ20 పగ్గాలు అప్పగించి.. 2023లో జరగనున్న వరల్డ్ కప్ వరకు వన్డే జట్టుకు రోహిత్ కెప్టెన్ వ్యవహరిస్తాడని.. టెస్ట్ చాంపియన్‌షిప్ సైకిల్ ముగిసే వరకు టెస్టుల్లోనూ అతనే జట్టుకు నాయకత్వం వహిస్తాడని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ రోహిత్ శర్మ తరుచూ ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటుండటంతో బీసీసీఐ అతనిపై అసహనంగా ఉంది. ప్రతీ రెండు సిరీస్‌లకు అతను దూరం అవుతున్నాడని, ఇలా అయితే వన్డే ప్రపంచకప్ గెలవడం కష్టమని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతని కెప్టెన్సీపై వేటు వేసి సాగనంపే ప్రయత్నం బోర్డు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ పెద్దల ఆలోచనల నేపథ్యంలో రోహిత్‌శర్మకు వచ్చే ఏడాదే వీడ్కోలు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొత్తంగా జైషా బీసీసీఐ కార్యదర్శిగా పగ్గాలు చేపట్టాక టీమిండియా కూడా గుజరాతీ మయం అవుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా క్రికెట్ కెప్టెన్ కూడా గుజరాతీనే అయితే.. ఆరోపణలకు మరింత బలం చేకూరుతుంది.