ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని తెల్లజుట్టు సమస్య వేధిస్తోంది. పోషకాహార లోపం, జన్యువుల ప్రభావం, ఇతర కారణాల వల్ల జుట్టు తెల్లబడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. స్కూల్ లో చదువుకునే విద్యార్థులు సైతం తెల్లజుట్టు సమస్య వల్ల బాధ పడుతుండటం గమనార్హం. జుట్టు తెల్లబడటం వల్ల ముఖం అందం మారిపోయే అవకాశంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ ఉంటుంది.
కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడుతుంటే ఆహారంలో పప్పుధాన్యాలను చేర్చుకుంటే మంచిదని చెప్పవచ్చు. పిల్లలను జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉంచితే మంచిదని చెప్పవచ్చు. పప్పుధాన్యాలలో విటమిన్ బీ9 తో పాటు ప్రోటీన్లు కూడా ఉంటాయి.
కూరగాయలలో అతి ముఖ్యమైన వాటిలో ఆకు కూరలు కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఆకు కూరలు ఎక్కువగా తినడం వల్ల జుట్టు తెల్లబడే అవకాశాలు తగ్గుతాయని చెప్పవచ్చు. పిల్లలు ఆకు కూరలు తినేలా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. పిల్లల ఆహారంలో డ్రై ఫ్రూట్స్ ను చేర్చితే పిల్లల ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు.
డ్రై ఫ్రూట్స్ లో శరీరానికి అవసరమైన రాగి ఉంటుందనే సంగతి తెలిసిందే. శరీరంలో మెలనిన్ ఉత్పత్తిని పెంచడంలో డ్రై ఫ్రూట్స్ సహాయపడతాయి. జుట్టును నలుపు రంగులో ఉంచే మెలనిన్ ను పెంచే సామర్థ్యం డ్రై ఫ్రూట్స్ లో ఉంటుందనే సంగతి తెలిసిందే.