Health Tips: ప్రస్తుత కాలంలో చాలా మంది సంపాదనలో పడి సరైన సమయంలో తినకుండా కాలంతోపాటు పరుగులు తీస్తూ సంపాదనలో పడిపోయారు. ఈ విధంగా సరైన సమయానికి భోజనం చేయకుండా ఉండటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా రక్తపోటు, థైరాయిడ్, పీసీఓడీ, మధుమేహం వంటి అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇక చాలామంది ఆహార విషయంలో ఎన్నో పొరపాట్లు చేస్తుంటారు.భోజనం చేసిన తరువాత వెంటనే కొన్ని రకాల పదార్థాలను తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకే భోజనం చేసిన వెంటనే కొన్ని రకాల పదార్థాలకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి ఆహార పదార్థాలు ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం…
కాఫీ: చాలామందికి ఉంది అతిపెద్ద అలవాటు భోజనం చేసిన తర్వాత కాఫీ తాగడం. అయితే ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన వెంటనే కాఫీ తాగడం వల్ల మనకు జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. కాఫీలో ఉండే టానిన్ అనే రసాయనం ఐరన్ శోషణ ప్రక్రియను అడ్డుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు కలుగుతాయి తినడానికి ఒక గంట ముందు గంట తర్వాత కాఫీ త్రాగకూడదు.
మద్యం: భోజనానికి అర గంట ముందు అర గంట తర్వాత కూడా మద్యం తాగకూడదు. మద్యం తాగటం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి కనుక మద్యం తాగకపోవడం మంచిది.
పండ్లు: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే భోజనానికి ముందు లేదా భోజనం తరువాత వెంటనే పండ్లను తినడం అలాగే పరగడుపున పండ్లను తినడం వల్ల ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక భోజనం చేసిన కాసేపటికి పండ్లు తినడం మంచిది.
చల్లటి నీరు: సాధారణంగా మనం భోజనం చేసినప్పుడు మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి మన శరీరంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ విడుదలవుతుంది. ఇలాంటి సమయంలో చల్లని నీటిని తాగటం వల్ల యాసిడ్ ప్రభావం తగ్గడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. అందుకే వెంటనే చల్లని నీరు తాగకూడదు.
సిగరెట్: చాలా మందిలో ఉండే సమస్య ఇది తిన్న వెంటనే సిగరెట్ కాల్చడం అలవాటుగా ఉంటుంది. సిగరెట్ తాగడం వల్ల ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చే అవకాశాలు పెరుగుతాయని తద్వారా కడుపులో అల్సర్ వస్తాయి. అందుకే సిగరెట్ తాగకూడదు అని నిపుణులు చెబుతున్నారు