పది అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

ఆర్మీ మెడికల్ కార్ప్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. గ్రూప్ సీ సివిలియన్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://indianarmy.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రకటన వెలువడిన రోజు నుంచి 45 రోజులలో ఈ ఉద్యోగ […]

Written By: Kusuma Aggunna, Updated On : January 31, 2022 9:18 am
Follow us on

ఆర్మీ మెడికల్ కార్ప్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. గ్రూప్ సీ సివిలియన్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://indianarmy.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

ప్రకటన వెలువడిన రోజు నుంచి 45 రోజులలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఆఫ్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీల కోసం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 120 నిమిషాలుగా ఉండనుంది. జనరల్ ఇంటెలిజన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ 50 ప్రశ్నలు, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు ఉంటాయి.

ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ప్రకటన వెలువడిన 45వ రోజులలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

పది, ఇంటర్ లేదా తత్సమాన అర్హతతో సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలలో బార్బర్ ఉద్యోగ ఖాళీలు 19, చౌకీదార్ ఉద్యోగ ఖాళీలు 4, కుక్ ఉద్యోగ ఖాళీలు 11, ఎల్డీసీ ఉద్యోగ ఖాళీలు 2, వాషర్ మెన్ ఉద్యోగ ఖాళీలు 11 ఉన్నాయి. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.