Bamboo Plant: వెదురు మొక్క వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. దీని వల్ల ఇంట్లో ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడుతాయట. మీ ఇంట్లో కూడా ఈ మొక్క ఉంటే ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోండి. వెదురు మొక్క అదృష్టాన్ని ఏ విధంగా పెంచుతుందో.. ప్రతికూల పరిస్థితులను కూడా అదే విధంగా పెంచుతుందట. ఇది కొన్ని విషయాలను పాటించకపోతే విషపూరితం అంటున్నారు వాస్తు పండితులు.
నీటిలో పెరిగే ఈ మొక్క ఒకటి రెండు సంవత్సరాలు ఈజీగా బతుకుతుంది. కానీ మట్టిలో పెడితే ఒక సంవత్సరం మాత్రమే జీవిస్తుందట. అయితే ఎక్కువ మట్టి ఉన్న దగ్గర పెడితే అది పెద్దగా పెరుగుతుంది. దీని వల్ల ఇంటికి కీడు అంటున్నారు నిపుణులు. తేమకు ఈ మొక్కలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇవి కేవలం 18 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య మాత్రమే జీవిస్తాయి.
ఇతర మొక్కల మాదిరి ఇవి స్పైడర్ మైట్స్, స్కేల్స్, మీలీబగ్స్ అనే తెగుళ్ళ బారిన పడుతాయి. దీని వల్ల ఇంటికి అరిష్టం. ఇక సూర్యకాంతి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పెడితే ఈ మొక్కలు జీవించడం కష్టం. అందుకే ఈ మొక్కలను ఎక్కువ ఎండలేని ప్రదేశంలో అంటే ఇంట్లోనే పెంచుకోవాలి. ఒకవేళ ఎండ ఎక్కువగా ఉంటే మొక్కల చెట్లు పసుపు రంగులోకి మారుతాయి. ఇంట్లో చెట్లు ఎండిపోవడం ఇంటికి మంచిది కాదంటున్నారు నిపుణులు. కాల్షియం ఆక్సలేట్ స్పటికాలు ఉంటాయి కాబట్టి దీని వల్ల చికాకు వస్తుందట.
ఈ ఆకులను ముట్టుకుంటే గొంతులో మంటకూడా వస్తుందట. పిల్లులు, కుక్కలకు ఈ మొక్క చాలా విషపూరితం అని తెలుస్తుంది. పొత్తి కడుపులో నొప్పి, సమన్వయ లోపం, అతిసారం, బలహీనత, వాంతులు వంటి రోగాలను కలిగిస్తుంది ఈ మొక్క. ఈ మొక్క వేర్లు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. మీరు పెట్టిన కుండీలో ఈ మొక్క వేర్లు వస్తుంటే పక్కన పెట్టండి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈ మొక్కను పెంచితే ఇంటికి అదృష్టం అంటున్నారు నిపుణులు. ప్రతికూలతు, అనుకూలతలు ఉన్న ఈ మొక్క వల్ల జాగ్రత్త తప్పదు.