https://oktelugu.com/

Degree Students: పెళ్లయితే నో ఎంట్రీ..!?

తెలంగాణలో డిగ్రీ చదువుతుండగానే చాలా మంది అమ్మాయిలకు తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా యువతులు విద్యాభ్యాంస కొనసాగిస్తున్నారు. అయితే పెళ్లి చేసుకున్న యువతలను హాస్టల్‌లో ఉండేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : March 26, 2024 1:08 pm

Degree Students

Follow us on

Degree Students: తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి గురుకుల విద్యాలయాలను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 3 వేలకుపైగా గురుకులాలు ఉన్నాయి. వీటిని క్రమంగా అప్‌గ్రేడ్‌ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం చాలా కళాశాలల్లో డిగ్రీ కూడా ప్రారంభించారు. ఉచిత విద్య, పుస్తకాలు, యూనిఫాలతోపాటు సంరక్షణ బాధ్యతను కూడా ప్రభుత్వ చూసుకుంటుండడంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకుల విద్యా సంస్థల్లో చేర్పిస్తున్నారు.

డిగ్రీ విద్యార్థినులకు ని‘బంధ’నాలు..
ఇదిలా ఉంటే.. పాఠశాల, జూనియర్‌ కళాశాల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో విద్యాబోధన బాగుంది. పేద విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతోపాటు ఎంసెట్, నీట్‌లోనూ సత్తా చాటుతున్నారు. డిగ్రీకి వచ్చే సరికి ఆయా జిల్లాల పరిధిలోని యూనివర్సిటీల అఫ్లియేషన్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. ఇక అన్ని గురుకులాలకు సొంత భవనాలు లేకపోయినా హాస్టల్‌ సౌకర్యం కూడా ఉంది. డిగ్రీ విద్యార్థినులు హాస్టల్‌లో ఉండేందుకు కొన్ని కండీషన్లు అమలు చేస్తున్నారు. పెళ్లి తర్వాత హాస్టల్‌లో ఉండేందుకు అనుమతించడం లేదు.

చాలా మందికి వివాహం..
తెలంగాణలో డిగ్రీ చదువుతుండగానే చాలా మంది అమ్మాయిలకు తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా యువతులు విద్యాభ్యాంస కొనసాగిస్తున్నారు. అయితే పెళ్లి చేసుకున్న యువతలను హాస్టల్‌లో ఉండేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. పెళ్లి చేసుకున్న యువతలు హాస్టల్‌లో ఉంటే, మిగతా విద్యార్థినులు ఇబ్బంది పడతారని పేర్కొంటున్నారు. అందుకే హాస్టల్‌లో ఉండేందుకు నిరాకరిస్తున్నట్లు చెబుతున్నారు.

అధికారులకు ఫిర్యాదు..
పెళ్లి చేసుకున్న విద్యార్థులను హాస్టల్‌లో ఉండేందుకు అనుమతించకపోవడంపై పలువురు వార్డెన్‌తోపాటు, ఆర్సీవోలకు ఫిర్యాదు చేశారు. కానీ, వాటిపై పెద్దగా స్పందించడం లేదు. పర్మిషన్‌ ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. ఉన్నత విద్య చదవాలనే లక్ష్యంతోనే తాము డిగ్రీ చదువుతున్నామని, కుటుంబ పరిస్థితుల కారణంగా పెళ్లి చేసుకున్నందుకు హాస్టల్‌లో ఉండడానికి అనుమతి నిరాకరించడం సరికాదని పేర్కొంటున్నారు. వార్డెన్లు, ఆర్సీవోలు త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.