Hari Hara Veera Mallu Event : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఈ చిత్రం మూడు సార్లు వాయిదా పడింది. ముందుగా మార్చి 28 న విడుదల చేద్దామని అనుకున్నారు. పవన్ కళ్యాణ్ కి ఉన్న పొలిటికల్ బిజీ కారణంగా అది జరగలేదు. ఆ తర్వాత మే 9న విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ అప్పటికి VFX వర్క్ పూర్తి కాకపోవడం జూన్ 12 కి వాయిదా వెయ్యాల్సి వచ్చింది. కచ్చితంగా జూన్ 12న ఈ చిత్రం విడుదల అవుతుందని అందరూ అనుకున్నారు. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు పెట్టారు. సినిమా విడుదలకు మరో పది రోజుల సమయం ఉంది అనగా, మరోసారి వాయిదా పడింది ఈ చిత్రం.
Also Read: ఓటీటీ లోకి వచ్చేసిన నితిన్ ‘తమ్ముడు’ చిత్రం..ఎందులో చూడాలంటే!
అలా వరుస వాయిదాల తర్వాత ఎట్టకేలకు షూటింగ్ కార్యక్రమాలను, ఉన్న ఇబ్బందులను తొలగించుకొని ఈ నెల 24 న విడుదల అయ్యేందుకు సిద్ధమైంది ఈ చిత్రం. రీసెంట్ గానే విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ఈ ట్రైలర్ యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతూ ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 15 నుండి నాన్ స్టాప్ గా ప్రొమోషన్స్ ని ప్లాన్ చేసిందట మూవీ టీం. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 19 న కానీ, 20 వ తేదిన కానీ తిరుపతి లో, లేదా విజయవాడ లో ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన స్పష్టమైన క్లారిటీ మరో రెండు రోజుల్లో రానుంది.
Also Read: భర్తతో విడాకులంటూ ప్రచారం.. నయనతార రియాక్ట్ ఇదే
భారీ వర్ష సూచనలు ఉన్న ఈ నేపథ్యం లో వాతావరణం సహకరిస్తే అవుట్ డోర్ స్టేడియం లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేస్తామని, లేకపోతే ఇన్డోర్ లోనే చేస్తామని AM రత్నం రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గతం లో మెగాస్టార్ చిరంజీవి మరియు సూపర్ స్టార్ రజనీకాంత్ లను ముఖ్య అతిథులుగా పిలవాలని అనుకున్నాడట నిర్మాత AM రత్నం. ఇప్పుడు వాళ్ళ డేట్స్ అందుబాటులో ఉంటే, వాళ్ళిద్దరినీ ఈ ఈవెంట్ కి తీసుకొచ్చే పని లో ఉన్నాడట. నేడు AM రత్నం మనవరాలి పుట్టినరోజు వేడుకలు చెన్నై లో జరుగుతున్నాయి. ఆయన తిరిగి హైదరాబాద్ కి వచ్చిన తర్వాత హరి హర వీరమల్లు కి సంబందించిన బిజినెస్ మొత్తాన్ని క్లోజ్ చేస్తాడని సమాచారం.