https://oktelugu.com/

గూగుల్ నిర్ణయం.. ఉద్యోగులకు ప్రయోజనమేనా?

కరోనా ప్రభావంతో ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం పద్దతికి అలవాటు పడ్డారు. దీంతో ఇన్నాళ్లు ఇళ్లకే పరిమితమైన ఉద్యోగులు ప్రస్తుతం ఆఫీసుకు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. ఉద్యోగులను ఆఫీసుకు రప్పించే క్రమంలో గూగుల్ మధ్యే మార్గాన్ని అనుసరిస్తోంది. ఒకేసారి ఆఫీసుకు వచ్చి పనిచేయడానికి బదులు ఇళ్లు, ఆఫీసుల నుంచి ఉద్యోగులు పని చేసే హైబ్రిడ్ విధానానికి శ్రీకారం చుట్టింది, కొవిడ్ నేపథ్యంలో గూగుల్ తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగుల నుంచి స్పందన ఆధారంగా తీసుకోనుంది. గూగుల్ కంపెనీలో సుమారు […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 8, 2021 / 06:27 PM IST
    Follow us on

    కరోనా ప్రభావంతో ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం పద్దతికి అలవాటు పడ్డారు. దీంతో ఇన్నాళ్లు ఇళ్లకే పరిమితమైన ఉద్యోగులు ప్రస్తుతం ఆఫీసుకు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. ఉద్యోగులను ఆఫీసుకు రప్పించే క్రమంలో గూగుల్ మధ్యే మార్గాన్ని అనుసరిస్తోంది. ఒకేసారి ఆఫీసుకు వచ్చి పనిచేయడానికి బదులు ఇళ్లు, ఆఫీసుల నుంచి ఉద్యోగులు పని చేసే హైబ్రిడ్ విధానానికి శ్రీకారం చుట్టింది, కొవిడ్ నేపథ్యంలో గూగుల్ తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగుల నుంచి స్పందన ఆధారంగా తీసుకోనుంది.

    గూగుల్ కంపెనీలో సుమారు 10 వేల మంది వరకు ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇంత మంది ఆఫీసుకు వచ్చి పనిచేయడం ఇబ్బందిగా ఉంటుందని భావించి ఏడాదిన్నర కాలంగా వర్క్ ఫ్రం హోం ను అమలు చేస్తోంది. అయితే సెప్టెంబర్ నుంచి ఆఫీసుకు రావాలంటూ గూగుల్ ఉద్యోగులను కోరడంతో వారు నిరాకరిస్తున్నారు. ఇళ్లు, ఆఫీసుల నుంచి పని చేయడానికి అవకాశం కల్పించాలంటూ 8500 మంది ఉద్యోగులు గూగుల్ ను కోరారు. కొందరు ఉద్యోగులు తమను ట్రాన్స్ ఫర్ చేయాల్సిందిగా అభ్యర్థించారు. ఇంకొద్దిమంది ఎక్విప్ మెంట్ మార్చాల్సిందిగా కోరడంతో అందుకు సిద్ధమంటూ సంస్థ పేర్కొంది.

    ఉద్యోగులు కోనిన విధంగా ఇళ్లు, ఆఫీసుల నుంచి హైబ్రిడ్ పద్ధతిలో పని చేసేందుకు గూగుల్ అంగీకరించింది. ఉద్యోగులు కోరినట్లుగా రీలోకేట్ చేసేందుకు కూడా సిద్ధమని తెలిపింది. ఇక ఇక్వీప్ మెంట్ మార్చాలంటూ వచ్చిన విన్నపాలను గూగుల్ తోసిపుచ్చింది. దీంతో ఉద్యోగులు గూగుల్ సంస్థపై ఎలా స్పందిస్తారోనని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సౌకర్యాల దృష్ట్యా ఏ మేరకు నిర్ణయాలు తీసుకోనుందని ఆసక్తిగా చూస్తున్నారు.

    ఇప్పటి వరకు గూగుల్ ఉద్యోగులు సగం మంది తమ ఆఫీసులను మార్చాలని కోరుతున్నారు.45 శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. దీనిపై గూగుల్ ప్రతినిధి స్పందిస్తూ ఉధ్యోగుల అవసరాల్ని తీర్చడం సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు. ఆఫీసు నిబంధనలు ఎలా ఉన్నాయి? దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఇంకా సమయం పడుతుందన్నారు. ఉద్యోగుల కోరికలు తీరుస్తామని చెప్పారు. సాధ్యంకాని హామీలు తీర్చేది లేదని పేర్కొన్నారు.

    దీంతో గూగుల్ సంస్థ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. వర్క్ ఫ్రం హోం కు ప్రాధాన్యం ఇస్తుందో లేక ఆఫీసుకు వచ్చి పని చేసేందుకే సుముఖత చెబుతుందో చూడాలి. కానీ ఉద్యోగుల సమస్యలు పట్టించుకుని తమ బాగోగులు చూడాలని అభ్యర్థనల మేరకు ఏ విధమైన పద్దతులు పాటిస్తారో అని ఉద్యోగులు ఆసక్తి ఉన్నారు.