https://oktelugu.com/

నయీం కేసులో పెద్ద తలకాయలని కాపాడుతున్నదెవరు?

కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్, నరహంతకుడు నయీం కేసు ఇప్పటీకీ తేలడం లేదు. నయీం దాదాపు పదివేల ఎకరాల భూములు తను కబ్జా చేశాడని, గుట్టలు గుట్టలుగా దస్తావేజులు దొరికాయనే కధనాలు వచ్చాయి. ఆ డబ్బు, భూములు ఎక్కడికి పోయాయి ? నయీం కబ్జా భూములు అనుభవిస్తున్న నయా నయీం ఎవరు ? అన్నది ఇప్పటికీ తేలని విషయంగా ఉంది. సీబీఐ విచారణ జరిపించాలన్న ప్రతిపక్షాల డిమాండ్ కు కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ముందుకు రాలేదన్నది ప్రశ్న? సిట్‌ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 8, 2021 / 06:24 PM IST
    Follow us on

    కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్, నరహంతకుడు నయీం కేసు ఇప్పటీకీ తేలడం లేదు. నయీం దాదాపు పదివేల ఎకరాల భూములు తను కబ్జా చేశాడని, గుట్టలు గుట్టలుగా దస్తావేజులు దొరికాయనే కధనాలు వచ్చాయి. ఆ డబ్బు, భూములు ఎక్కడికి పోయాయి ? నయీం కబ్జా భూములు అనుభవిస్తున్న నయా నయీం ఎవరు ? అన్నది ఇప్పటికీ తేలని విషయంగా ఉంది. సీబీఐ విచారణ జరిపించాలన్న ప్రతిపక్షాల డిమాండ్ కు కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ముందుకు రాలేదన్నది ప్రశ్న? సిట్‌ రిపోర్ట్, నయీమ్ బ్లూ డైరీ బయట పెట్టాలని ప్రతిపక్ష కాంగ్రెస్ తాజాగా డిమాండ్ చేస్తోంది. ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారిక పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..

    ‘గ్యాంగ్ స్టార్ నయీం ఎన్ కౌంటర్ జరిగి ఐదేళ్ళు గడుస్తున్నా కొండని తవ్వి ఎలుకని కూడా పట్టని తీరులో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్. నయీం ఎన్ కౌంటర్ జరిగినపుడు వేలకోట్ల రూపాయిల నగదు దొరికిందని, డబ్బుని లెక్కపెట్టడానికి ఎలాక్ట్రానిక్ మిషన్లు కూడా కావాలని వార్తలు వెలువడ్డాయి. దాదాపు పదివేల ఎకరాల భూములు తను కబ్జా చేశాడని, గుట్టలు గుట్టలుగా దస్తావేజులు దొరికాయనే కధనాలు వచ్చాయి. ఆ డబ్బు, భూములు ఎక్కడికి పోయాయి ? అని ప్రశ్నించారు దాసోజు.

    ”టీఆర్ఎస్ పార్టీ చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రముఖులకు నయీంతో సంబంధాలు వున్నట్లు వార్తలు విన్నాం. కానీ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. నయీం కేసులో కేవలం చిన్న స్థాయిలో వున్న పోలీసు అధికారులని కొంతమందిని బలిపశువులుగా చేసి పెద్దతలకాయలని కాపాడే కుట్ర జరుగుతుంది. నయీం అక్రమంగా కూడాబెట్టిన ధనం, భూములని ఏ నయా నయీం తింటున్నాడు ? టీఆర్ఎస్ పార్టీ చెందిన నాయకుల పేర్లు బయటికి వచ్చినా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ? అని ప్రశ్నించారు దాసోజు.

    ”నయీం కేసులో ఐదేళ్ళు గడుస్తున్న చార్జ్ సీట్లు ఇంకా ఎందుకు పూర్తి కాలేదు. ఒక కేసుకు సంబంధించి ఐదేళ్ళలో చార్జ్ సీట్లు పూర్తి కాకపొతే ఎలాంటి పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో నడుస్తుంది? నయీం ఎన్ కౌంటర్ జరిగినప్పుడే అనేక రాష్ట్రాలకు లింకులు వున్న ఈ కేసుపై సిబిఐ వేయాలని కోరాం. కానీ సిఎం కేసీఆర్ మొండి వైఖరితో నాగిరెడ్డి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. మరి సిట్ దర్యాప్తు ఏమయింది ? నయీం కేసులో వెలుగు చూసిన కీలకమైన బ్లూ డైరీ ఏమయింది ? టీఆర్ఎస్ నాయకులని కాపాడుతున్నవారెవరు ? నయీం కి సంబధించిన భూములు ఎవరి కబ్జాలో వున్నాయి ? అని ప్రశ్నించారు దాసోజు.

    ”నయీం కేసులో సిట్ ప్రజలకు జబాబుదారీగా వుండాలి. సిట్ రిపోర్ట్ ని బహిర్గతం చేయాలి. బ్లూ డైరీని విడుదల చేయాలి. బ్లూ డైరీలో వున్న అనేకమంది టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. చిన్న స్థాయి పోలీసులని సస్పెండ్ చేసి వాళ్ళని బలిపశువులని చేశారు . అలా కాకుండా ఈ కేసులు అధికారి పార్టీకి చెందిన పెద్ద తలకాయలపై చర్యలు తీసుకోవాలి. నయీం వల్ల లబ్ది పొందిన రాజకీయ నాయకలు, ప్రముఖులందరిపైన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు దాసోజు.