https://oktelugu.com/

ఒలింపిక్స్ కోసం 6 నెలలు వాటికి దూరంగా నీరజ్.

భారతావని ఆశలకు జీవం పోశాడు. ఇన్నాళ్లు ఎంతో ఉద్విగ్నభరితంగా ఎదురు చూసిన మధుర క్షణాలకు ప్రాణం పోశాడు. తనదైన శైలిలో ఆడి దేశానికి స్వర్ణ పతకం తెచ్చాడు. ఒలింపిక్స్ చరిత్రలో కొత్త మైలురాయి సృష్టించాడు. అథ్లెటిక్స్ లో ఇంతవరకు భారత్ కు పతకం రాకపోవడంతో ఎంతో బాధ పడినా అది నీరజ్ చోప్రా రూపంలో తీరింది. 130 కోట్ల ప్రజల కోరికను తీర్చిన ఘనత ఆయనదే. దేశానికి స్వర్ణ పతకం తీసుకురావడం అంటే మాటలు కాదు. దానికి […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 8, 2021 / 06:39 PM IST
    Follow us on

    భారతావని ఆశలకు జీవం పోశాడు. ఇన్నాళ్లు ఎంతో ఉద్విగ్నభరితంగా ఎదురు చూసిన మధుర క్షణాలకు ప్రాణం పోశాడు. తనదైన శైలిలో ఆడి దేశానికి స్వర్ణ పతకం తెచ్చాడు. ఒలింపిక్స్ చరిత్రలో కొత్త మైలురాయి సృష్టించాడు. అథ్లెటిక్స్ లో ఇంతవరకు భారత్ కు పతకం రాకపోవడంతో ఎంతో బాధ పడినా అది నీరజ్ చోప్రా రూపంలో తీరింది. 130 కోట్ల ప్రజల కోరికను తీర్చిన ఘనత ఆయనదే. దేశానికి స్వర్ణ పతకం తీసుకురావడం అంటే మాటలు కాదు. దానికి ఎంతో సాధన కావాలి. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అలవోకగా పతకం సాధించి దేశం ఆశలను సజీవంగా ఉంచాడు. బరిసెను 87.58 మీటర్ల దూరం విసిరి రికార్డు నెలకొల్పాడు.

    నీరజ్ చోప్రాకు ఇష్టమైన ఆహారం అంటే ఇంట్లో తయారు చేసే చుర్మా (పంచదార, నెయ్యితో చేసిన రోటీ). ఆయన తల్లి సరోజ్ దేవి ఎక్కువగా చేసి పెడుతుండేది. ఈవెంట్స్ కు ముందు నీరజ్ చుర్మా కు దూరంగా ఉన్నాడని తెలిపారు. టోక్యో ఒలింపిక్స్ కోసం ఆరు నెలల ముందు నుంచి వాటిని తినడం మానేశాడని పేర్కొన్నారు. భారత్ కు స్వర్ణం తీసుకురావడం గర్వంగా ఉందని తల్లి చెప్పింది.

    ఒలింపిక్స్ 2021కు వెళ్లడానికి ముందు నీరజ్ చోప్రా మీడియాతో తన అనుభవాలు పంచుకున్నాడు. తనకు బ్రెడ్ ఆమ్మెట్ ఇష్టమని చెప్పాడు. తన కోసం సాల్టెడ్ రైస్ వండుకుంటాడు. టోర్నమెంట్లు ఉన్న సమయాల్లో సలాడ్లు, పండ్లు తింటాడు. ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటాడు. ఇటీవల తన డైట్ లో సాల్మన్ చేపలను చేర్చుకున్నాడు. శరీర బరువును ఎప్పుడు సరిచూసుకుంటాడు.

    నీరజ్ చోప్రాది హర్యానా రాష్ర్టంలోని పానిపట్ జిల్లా ఖాంద్రా గ్రామం. నీరజ్ తండ్రి రైతు. చిన్నప్పుడు నీరజ్ కు క్రికెట్ అంటే ఇష్టం. 11 ఏళ్ల వయసులో జావెలిన్ త్రో మీద ఆసక్తి పెంచుకున్నాడు. పానిపట్ స్టేడియంలో జైవీర్ అనే అథ్లెట్ జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తుంటే చూసి నీరజ్ కు కూడా నేర్చుకోవాలనే తపన ఏర్పడింది. దీంతో అలాజజ పంచ్ కులలోని స్పోర్ట్స్ అథారిటీ ఆప్ ఇండియా స్పోర్ట్స్ హాస్టల్ లో ఉండి జావెలిన్ లో శిక్షణ పొందాడు. నీరజ్ కు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. నీరజ్ కు ప్రస్తుతం 23 ఏళ్లు.