Horoscope 2022: రెండేళ్లుగా ప్రజలను కరోనా మహమ్మారి వెంటాడుతోంది. దాంతో జనాల ఆర్థిక పరిస్థితులు ఇంకా ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇక కొవిడ్ భయాలు పోయాయి అని అనుకునేలోపే వైరస్ వ్యాప్తి మళ్లీ ఉధృతమవుతున్నది. ఫలితంగా నష్టాలు వస్తున్నాయి. కాగా, ఈ సంవత్సరం అనగా 2022లో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, పెద్దలు చెప్తున్న దాని ప్రకారం..ఈ రాశుల వారికి లాభాలు బాగా వస్తాయి.

ఈ యేడు రాశుల వారి కష్టాలన్నీ తొలగిపోయి లాభాలే లాభాలు వస్తాయని అంటున్నారు. ఆ రాశులు సింహ, కన్య, తుల, ధనస్సు, వృశ్చికం, కుంభ, వృషభం. ఈ రాశుల వారికి ఈ యేడు చక్కటి లాభాలు కలుగుతాయి. సింహ రాశి వారికి ధన లాభం ఉంటుంది. ఈ రాశి వారు చాలా కాలంగా కష్టపడి పని చేస్తుండగా, ఈ యేడు వీరు అనుకున్నట్లుగా మంచి రాబడి ఉండొచ్చు. ఇందుకుగాను వీరు ఉద్యోగం మారాల్సి ఉంంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

కన్య రాశి వారికి ఈ యేడు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. విద్య నుంచి వీళ్లు ప్రయోజనం పొందుతారు. విదేశీ విద్య గురించి ఆలోచించే వారు ఈ యేడు చక్కటి ప్రయోజనాలు పొందుతారు. తుల రాశి వారికి ఈ యేడు ప్రేమ జీవితంలో విజయం సాధిస్తారు. వీరు ఏదేని నిర్ణయం తీసుకునే ముందర ఆలోచించడం చాలా ముఖ్యమని భావించాలి. ధనస్సు రాశి వారికి కుజుడి ప్రభావం వలన ధన లాభం కలుగుతుంది. వీరికి ఉపాధి లభించే చాన్సెస్ ఉంటాయి. అయితే, వీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.ఎందుకంటే వీరికి ఈ యేడు ఆర్థిక పరమైన సమస్యలు గ్రహాల ప్రభావం వలన వచ్చే చాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి.
Also Read: పొరపాటున కూడా శనివారం ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు!
వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరమైన స్థిరత్వం ఏప్రిల్ తర్వాత ఏర్పడొచ్చని జ్యోతిష్య శాస్త్ర పెద్దలు చెప్తున్నారు. కుంభ రాశి వారికి ఈ యేడు వృత్తి పరమైన లక్ష్యాలను సాధించగలగుతారు. దాంతో పాటు వీరు వ్యాపారంలో ఎదుగుతారు. కానీ, అందుకుగాను వీరు కొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. అవేంటంటే.. వీరిపైన రాహువు ప్రభావం వలన ఆర్థికంగా, ఉద్యోగ పరంగా సవాళ్లు ఏర్పడుతుంటాయి. దాంతో వీరికి ఆర్థికంగా అనుకూలమైన సమయం వచ్చేంత వరకు కొంత కాలం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. వృషభ రాశి వారు కూడా అంతే.. వీరికి విజయాలు వస్తాయ. కానీ, వీరు పెట్టుబడులు పెంటే ముందర జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఆర్థిక పరమైన సమస్యలు తలెత్తొచ్చు. కాబట్టి ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
Also Read: చీకటి పడ్డాక ఈ వస్తువులు, పదార్థాలను ఇవ్వొద్దు.. ఎందుకో తెలుసా?
[…] Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న మూవీ ‘ఖిలాడీ’. ఇవాళ రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 10.08 గంటలకు ‘ఫుల్ కిక్కు’ అంటూ సాగే 4వ పాటను రిలీజ్ చేయాల్సి ఉంది. నాలుగు రోజుల క్రితమే ‘ఖిలాడీ’ మూవీ గురించి చిత్ర యూనిట్ ఈ అప్‌డేట్‌ను విడుదల చేసింది. […]