Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేస్తున్నాడు. అయితే, తాజాగా ఈ ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ నుంచి రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్రానికి సంబంధించి ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్ లో చారల చొక్కా, నలుపు జీన్స్ లో రవితేజ అల్ట్రా-స్టైలిష్ లుక్ లో రవితేజ అదిరిపోయాడు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. , కార్తీక్ ఘట్టమనేని కెమెరా మెన్ గా ఉన్నాడు.
Also Read: ఈ రాశుల వారికి ఈ సంవత్సరం ముట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఉందో లేదో చూడండి..
ఇక ఈ సినిమాలో రవితేజ పారితోషికం పై కూడా అనేక రూమర్స్ వినిపించాయి. గతంలో కంటే కూడా.. ఈ సినిమాకు రవితేజ ఎక్కువ డిమాండ్ చేసాడని వార్తలు వచ్చాయి. అయితే రవితేజ ఉన్నట్టు ఉండి, ఇలా పారితోషికం విషయంలో ఎక్కువ డిమాండ్ చేయడానికి కారణం.. ‘క్రాక్’ అద్భుత విజయాన్ని అందుకోవడం అట.

ఇక రవితేజ పుట్టినరోజు సందర్భంగా రవితేజ ప్రస్తుతం చేస్తున్న 6 సినిమాల నుంచి వరుస అప్ డేట్స్ వస్తున్నాయి. ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘ధమాకా’, ‘రావణాసుర’, టైగర్ నాగేశ్వరరావు, అలాగే బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమాలో కూడా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Also Read: పొరపాటున కూడా శనివారం ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు!
[…] Buchibabu Movie with NTR: ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు దర్శకుడు బుచ్చిబాబు సానా. ఆయన డెబ్యూ మూవీ ఉప్పెన ప్రభంజనం సృష్టించింది. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఉప్పెన చిత్రం వంద కోట్ల వసూళ్లతో నిర్మాతలకు వసూళ్ల వర్షం కురిపించింది. మూడు రెట్లు లాభాలు పంచిన ఉప్పెన చిత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. కొత్త హీరో హీరోయిన్ వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలతో బుచ్చిబాబు సానా చేసిన ప్రయోగం ప్రేక్షకులను మాయ చేసింది. […]