Homeబిజినెస్EPFO Pension: ఈపీఎఫ్‌వో ఖతాదారులకు గుడ్‌ న్యూస్‌.. పెరగనున్న పెన్షన్‌..!

EPFO Pension: ఈపీఎఫ్‌వో ఖతాదారులకు గుడ్‌ న్యూస్‌.. పెరగనున్న పెన్షన్‌..!

EPFO Pension: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌వో)ఖాతాదారులు త్వరలో శుభవార్త అందించనుంది. తాజాగా వెలువడుతున్న నివేదికల ప్రకారం.. కనీస పెన్షన్‌∙మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఇటీవలే వడ్డీరేటును బాగా తగ్గించిన కేంద్రం ఖాతాదారులకు శుభవార్త చెప్పాలని యోచిస్తోంది. ఈమేకు వచ్చే నెలలో జరిగే ఈపీఎఫ్‌వో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీల సమావేశం పెన్షన్‌ పెంపుకు సంబంధించి నిర్ణయం తీసుకున అవకాశం ఉంది. కనీస పెన్షన్‌ను మూడు రెట్లు పెంచడంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కనీస పింఛను ప్రస్తుతం రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచే అవకాశం కనిపిస్తోంది. లేబర్‌ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ ఈ విషయంలో తన నివేదికను త్వరలో సమర్పించనుంది. ఈ నిర్ణయంతో దాదాపు 6.5 లక్షల మంది పెన్షనర్లు, 5 కోట్ల మంది ఈపీఎ‹ఫ్‌ చందాదారులకు ప్రయోజనం చేకూరుతుంది.

EPFO Pension
EPFO Pension

సీబీటీ వాటా పెంచే అవకాశం..
సీబీటీ ఈక్విటీ పరిమితిని 15 శాతం నుంచి 25 శాతానికి పెంచడంపై కూడా త్వరలో జరిగే ఈపీఎఫ్‌వో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీల సమావేశంలో చర్చించనున్నారు. ఈక్విటీలో పెట్టుబడి పెంపుదలకు కార్మిక సంఘం అనుకూలంగా లేదని తెలుస్తోంది. స్టాక్‌ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి కారణమని పేర్కొంటున్నారు. ఇప్పటికే ఏడేళ్లుగా వడ్డీ రేటు తగ్గిస్తున్న కేంద్రం సీబీటీ వాటా పెంచినా తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్న భావన ఉంది. ఒకవైపు ప్రైవేటు వడ్డీలు పెరుగుతుంటే, ఈపీఎఫ్‌ వడ్డీ తగ్గించడంపై ఖాతాదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Early Elections In Telangana: ముందస్తు మంత్రాంగం.. త్వరలో తెలంగాణ అసెంబ్లీ రద్దు!

EPFO Pension
EPFO

నాలుగు దశాబ్దాల కనిష్టానికి వడ్డీ రేటు..
ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ సబ్‌స్క్రైబర్లకు షాకిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ 2021–22 ఆర్థిక సంవత్సరానికి 8.1 శాతం వడ్డీ రేటును ప్రకటించింది. ఇది నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి. 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌పై వడ్డీ రేటు 8.5 శాతం ఉండేది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం 65 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లపై ఉంటుంది. ఇదే సమయంలో ఈక్విటీలలో పెట్టుబడిని పెంచడం ద్వారా రాబడిని పొందడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు రెండు వారాల క్రితం ఫైనాన్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఆడిట్‌ కమిటీ ముఖ్యమైన సమావేశం జరిగింది. ఈ కమిటీ సమర్పించే ప్రతిపాదన ఈపీఎఫ్‌ సెంట్రల్‌ బాడీ ఆఫ్‌ ట్రస్టీ సమావేశంలో సమర్పించే అవకాశం ఉంది.

Also Read:Undavalli Arunkumar- KCR: బీఆర్‌ఎస్‌ కార్యవర్గంపై కసతర్తు.. ఏపీ పగ్గాలు ఉండవల్లికి

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version