Anasuya Bharadwaj: ఫాలోయింగ్ లో ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ అనసూయది. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన బోల్డ్ బ్యూటీ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అనసూయ ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అలాగే స్టార్ హీరోల చిత్రాల్లో కీలక రోల్స్ దక్కించుకుంటున్నారు. కథనం, థాంక్ యూ బ్రదర్ చిత్రాలు ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కాయి. అలాగే దర్జా పేరుతో మరో మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో అనసూయ లేడీ గ్యాంగ్ స్టర్ గా నటించడం విశేషం. దర్జా టీజర్ విడుదల కాగా అనసూయ లుక్ అండ్ మేనరిజం ఆకట్టుకున్నాయి. దర్జా మూవీలో హీరో సునీల్ కీలక రోల్ చేస్తున్నారు.
ఇక పుష్ప 2, రంగమార్తాండ, పక్కా కమర్షియల్ చిత్రాల్లో అనసూయ నటిస్తున్నారు. పక్కా కమర్షియల్ మూవీ విడుదలకు సిద్ధమైంది. అటు యాంకర్ గా పలు టెలివిజన్ కార్యక్రమాల్లో అలరిస్తున్నారు. తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ లో అనసూయ కొనసాగుతున్నారు. అయితే రష్మీతో పాటు అనసూయ జబర్దస్త్ వదిలేయనునట్లు కథనాలు వెలువడుతున్నాయి.
Also Read: Prathyusha Garimella: ప్రత్యూష ఆత్మహత్యలో షాకింగ్ నిజాలు.. పదిరోజుల ముందే ఆ పని చేసిందట!
తాజాగా అనసూయ స్టార్ మా కు వచ్చారు. సూపర్ సింగర్ జూనియర్స్ పేరుతో ఓ సింగింగ్ షో ఇటీవల మొదలైంది. చిత్ర, మను, హేమ చంద్ర వంటి సింగర్స్ జడ్జెస్ గా ఉన్న ఈ షోకి అనసూయ, సుడిగాలి సుధీర్ యాంకర్స్ గా వ్యవహరిస్తున్నారు. యాంకర్ గా, నటిగా రెండు బాధ్యతలు చక్కగా నెరవేరుస్తూ ముందుకు వెళుతున్నారు.
ఇటీవలే అనసూయ 14వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా భర్త భరద్వాజ్ తో పాటు విహారానికి వెళ్ళింది. అక్కడ సాగర తీరంలో భర్తకు హాట్ హాట్ లిప్ లాక్ లు ఇస్తూ రచ్చ చేసింది. అనసూయ, భరద్వాజ్ ల రొమాంటిక్ వీడియో వైరల్ గా మారింది.
ఇక సోషల్ మీడియాలో అనసూయ రచ్చ మాములుగా లేదు. వరుస ఫోటో షూట్స్ తో కేక పుట్టిస్తున్నారు. వన్ మిలియన్ కి పైగా ఉన్న ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం నాన్ స్టాప్ గ్లామర్ ట్రీట్ సిద్ధం చేస్తున్నారు. తాజాగా ట్రెండీ వేర్ లో నాటీ ఫోజులిచ్చింది. ఎద పై ఉన్న టాటూ కనిపించేలా టెంప్టింగ్ ఫోటో షూట్ చేశారు. అనసూయ లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారగా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read:Prabhu Deva Ex-Wife: నయనతార పై సంచలన ఆరోపణలు చేసిన ప్రభుదేవా మాజీ భార్య