https://oktelugu.com/

Aadhaar Card: ఆధార్‌ కార్డుదారులకు అదిరే శుభవార్త.. సందేహాల నివృత్తికి కొత్త ఫీచర్‌

యూఐడీఏఐ లాంఛ్ చేసిన ఈ కొత్త స్వీస్‌పేరు ఆధార్‌ మిత్ర. ఆర్టీఫీషియల్, మెషీన్‌ లెర్నింగ్‌ చాట్‌ బాట్‌ ద్వారా ప్రజలు ఆధార్‌ పీవీసీ స్టేటస్, ఫిర్యాదు చేయడం, వాటిని ట్రాక్‌ చేయడం...

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 19, 2024 5:19 pm
    aadhaar mitra chatbot

    aadhaar mitra chatbot

    Follow us on

    Aadhaar Card: ఆధార్‌ వినియోగదారులు ఆధార్‌ ప్రాధికార సంస్థ యూనిక్యూ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) శుభవార్త చెప్పింది. ఒక కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అధార్‌ వినియోగదారుల సందేహాల నివృత్తికి కొత్త చాట్‌బాట్‌ను లాంఛ్ చేసింది. దీనిద్వారా ఆధార్‌ కార్డుదారులు పలు సేవలు పొందవచ్చు.

    ఆధార్‌ మిత్ర..
    యూఐడీఏఐ లాంఛ్ చేసిన ఈ కొత్త స్వీస్‌పేరు ఆధార్‌ మిత్ర. ఆర్టీఫీషియల్, మెషీన్‌ లెర్నింగ్‌ చాట్‌ బాట్‌ ద్వారా ప్రజలు ఆధార్‌ పీవీసీ స్టేటస్, ఫిర్యాదు చేయడం, వాటిని ట్రాక్‌ చేయడం, ఎన్‌రోల్‌మెంట్‌ స్టేటస్, సందేహాలు నివృత్తి చేసుకోవడం వంటి సేవలు పొందవచ్చు. బెటర్‌ రెసిడెన్షియల్‌ ఇంటరాక్షన్‌ కోసం ఈ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు యూఐడీఏఐ తెలిపింది.

    సేవలు ఇలా పొందవచ్చు..
    ఆధార్‌ కార్డు ఉన్నవారు ఎవరైనా ఆధార్‌ మిత్ర సేవలు పొందవచ్చు. సేవలు పొందాలనుకునేవారు యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఆధార్‌ మిత్ర సేవలు పొందవచ్చు. చాలా సులభంగా పలు సర్వీస్‌లు పొందచ్చని యూఐడీఏఐ పేర్కొంది. పిల్లలకు కొత్త ఆధార్‌ కార్డు తీసుకోవాలని భావిస్తే లేదంటే ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ లేదా ఆధార్‌ సెంటర్‌ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి కూడా ఆధార్‌ మిత్ర ఉపయోగపడుతుంది.

    ఇంకా ఈ సేవలు..
    ఆధార్‌ మిత్ర చాట్‌బాట్‌ ద్వారా ఎన్‌రోల్‌మెంట్‌ స్టేటస్‌ తెలుసుకోవచ్చు. ఇంకా ఏమైనా ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేసి ఉంటే అప్పడు ఆ అప్‌డేట్‌ స్టేటస్‌ కూడా చెక్‌ చేసుకోవచ్చు. యూఐడీఐఏ ట్వీట్‌లో క్యూర్‌ కోడ్‌ కూడా ఉంది. దీనిని స్కాన్‌ చేయడం వీరు నేరుగా ఆధార్‌ మిత్ర సేవలు పొందవచ్చు. ఈ క్యూఆర్‌ కోడ్‌లో యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌ ఉంటుంది. ఈ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయగానే యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి వెళా‍్తరు. ఆధార్‌ మిత్ర చాట్‌బాట్‌ ద్వారా ఆధార్‌ సెంటర్‌లో అపాయింట్‌మెంట్‌ కూడా బుక్‌ చేసుకోవచ్చు. దీనివల్ల వీలున్న సమయంలో ఆధార్‌ సెంటర్‌కు వెళ్లి పని చేసుకోని రావొచ్చు. ఇంకా ఆధార్‌కు సంబంధించిన సమస్యలు ఉంటే ఆధార్‌ మిత్ర ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.