Good Humanity: సమాజంలో మంచివారు, చెడ్డవారు రెండు రకాల మనసులు ఉంటారు. కానీ కొంతమంది చెబుతూ ఉంటారు సమాజమే చెడిపోయింది అని. అంటే ఎక్కువ శాతం చెడ్డవారే కనిపిస్తూ ఉంటారని అంటుంటారు. ఎక్కడో ఒక వ్యక్తి మంచివారు కనిపిస్తే వారిని విడిచిపెట్టకుండా స్నేహం చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. అయితే మంచివారు మాత్రం ఎక్కువగా ఇతరులతో కలిసి పోవడానికి ప్రవర్తించరు. వారిలో భిన్నమైన లక్షణాలు ఉంటాయి. వారికి ఉండే లక్షణాలతో వారి మనసును గెలుచుకోవడానికి చాలా కష్టమవుతుంది. అయితే వారి కి ఎటువంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..
మర్యాద:
మంచివారికి ఉండే ప్రధాన లక్షణం మర్యాద. వీరు ఇతరులకు ఎక్కువగా మర్యాద ఇస్తుంటారు. అలాగే ఇతరుల నుంచి మర్యాద కోరుకుంటారు. ఏ పనైనా గౌరవంగా పూర్తి చేయాలని అనుకుంటారు. వీరిని తెలుసుకోవాలంటే పరుష మాటలతో.. ఆయుధాలతో సాధ్యం కాదు. కేవలం మర్యాదతోనే వారిని గెలుచుకునే అవకాశం ఉంటుంది. అయితే కొందరికి ఇది నచ్చకపోతే వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు.
Also Read: డార్క్ చాక్లెట్.. ఖర్జూర.. ఏది బెటర్?
స్వార్థం:
చాలామంది ఒకరికి సహాయం చేస్తే నాకేం వస్తుంది? అన్న ధోరణితో ప్రవర్తిస్తారు. ఇతరులకు సహాయం చేయడానికి వారిలో ఎంతో కొంత ఆశిస్తారు. కానీ మంచివారు మాత్రం స్వార్థం లేకుండా సహాయం చేయడానికి ముందుకు వస్తారు. తమకు ఎలాంటి లేకున్నా.. కళ్లకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ప్రతిఫలం ఏమాత్రం ఆశించని వీరు అలా సహాయం చేసి ఒక్కోసారి నష్టపోతారు కూడా. అయితే స్వార్థం లేకుండా సహాయం చేయడం వల్లే తమ మనసు ప్రశాంతంగా ఉంటుందని చెబుతూ ఉంటారు.
మౌనం:
తక్కువ మాట్లాడితే చాలా మంచిది అని మంచివారు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అనవసరమైన మాటలతో ఇతరులను నొప్పించకూడదని అనుకుంటారు. అంతేకాకుండా ఒక పని కోసం ఇతరులను చేయిచాచి అడగవద్దని.. తనకున్న సామర్థ్యం తోనే ఆ పనిని పూర్తి చేయాలని అనుకుంటారు. అయితే ఈ పని చేసేటప్పుడు వారు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా దానిని పూర్తి చేయడానికి ఇష్టపడతారు. ఈ క్రమంలో వీరు ఎక్కువగా మౌనంతో ఉంటారు. కానీ ఎదుటివారికి మౌనంగా ఉండడం ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఇలాంటి వారిని మాట్లాడించడానికి ట్రై చేస్తారు. కానీ ఆత్మాభిమానాన్ని కోల్పోకుండా వారు మౌనంగానే ఉండడానికి ప్రయత్నిస్తారు.
Also Read: యవ్వనంలోకి రాగానే ఈ 5 విషయాలను నేర్చుకోవాలి.. ఎందుకంటే?
ఓర్పు:
ఏ పని చేయడానికి అయినా ఓర్పు నేటి కాలంలో కచ్చితంగా అవసరం. ఎందుకంటే తొందరపడి తీసుకునే నిర్ణయాలు, పనులు ఎప్పటికీ సక్సెస్ కావు. అంతేకాకుండా కష్టం వచ్చిన సమయంలో కూడా ఓర్పుతో ఉండాలి. ఇక ఏదైనా పని చేసినప్పుడు దాని ఫలితం కోసం కూడా వేచి చూసే ధోరణితో ఉండాలి. ఇలాంటి అప్పుడే అనుకున్న విజయాలు పొందుతారు. కాలం కూడా ఒక్కోసారి కలిసి వస్తుంది అని అంటారు. మంచి వారిలో ఓర్పు అనే లక్షణం ఉంటుంది.
విలువ:
సమాజంలో గుర్తింపు ఉండడానికి మంచివారు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇందుకోసం తప్పుడు పనులు చేయకుండా ప్రయత్నిస్తారు. అయితే ఒక్కోసారి అనుకోకుండా తప్పులు చేసినా వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా తమ విలువను కాపాడుకుంటూ ఉంటారు.