Dark Chocolate is good or bad : మనం తినే ఆహారంలోనే ఆరోగ్యం ఉంటుందని కొందరు వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. అందువల్ల నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తారు. ఒక్కోసారి రెగ్యులర్గా తీసుకుని ఆహారంలో సరైన పోషకాలు అందకపోవచ్చు. ఇలాంటి అప్పుడు కొన్నిసార్లు అదనపు శక్తిని పొందడానికి ఇతర పదార్థాలను తింటూ ఉండాలి. ముఖ్యంగా పోషకాలు ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల రెగ్యులర్గా తీసుకుని ఆహారం తగ్గించినా పర్వాలేదు. అయితే మార్కెట్లో ఎన్నో రకాల పదార్థాలు ఉన్నా.. ఒకవైపు ఇవి ప్రయోజనాలు ఇస్తూనే.. మరోవైపు అనారోగ్యానికి గురిచేస్తాయి. ఇలాంటి అప్పుడు పోషకాలు ఎక్కువగా ఇచ్చే పదార్థాల కన్నా.. అనారోగ్యానికి గురి చేసే వాటికి దూరంగా ఉండటమే మంచిది. అలా ఓవైపు పోషకాలు ఇస్తూ.. మరోవైపు అనారోగ్యానికి గురికాకుండా ఉండే పోషకాలు ఏవి?
Also Read: బంగారం, వజ్రాలు సాటి రావు.. ఈ చెట్టు కిలో కలప కోటి రూపాయలు.. ఇంతకీ దీని విశిష్టతలు ఏమిటంటే..
మార్కెట్లో దొరికే కొన్ని డ్రై ఫ్రూట్స్ తో పాటు చాక్లెట్లలో కూడా పోషకాలు ఉంటాయన్న విషయం వాస్తవం. వీటిలో డార్క్ చాక్లెట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. డార్క్ చాక్లెట్ తినడం వల్ల గుండె జబ్బులను నివారించవచ్చు. అలాగే దీని తీసుకున్న తర్వాత మెదడు పనితీరు బాగుంటుంది. మానసిక స్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. బరువు ఎక్కువగా ఉన్నవారు డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఫలితం ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగ్గా ఉండడంతో జ్ఞాపకశక్తి పెరిగే అవకాశం ఉంటుంది. పార్కు చాక్లెట్లో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. డార్క్ చాక్లెట్ లో మెగ్నీషియం, రాగి, పొటాషియం, భాస్వరం, జింక్ అనే ఖనిజాలు ఉంటాయి.
అలాగే డ్రై ఫ్రూట్ విషయానికి వస్తే ఖర్జూర అధిక మొత్తంలో ప్రయోజనాలు ఇస్తుంది. ఖర్జూలలో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా అనేక రకాల విటమిన్లు ఉన్నాయి. ఖర్జూరను తీసుకోవడం వల్ల గుండె మెరుగ్గా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎముకలను బలోపేతం చేస్తుంది. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండడానికి ఖర్జూర తీసుకోవాలని అంటుంటారు. పురుషుల్లో ఆదనపు శక్తి రావడానికి ఖర్జూలను తింటూ ఉండాలని చెబుతారు.
Also Read: ఈ యాప్ తో వద్దన్నా వ్యాయామం చేస్తారు.. ఎలాగో తెలుసుకోండి..
ఖర్జూర, డార్క్ చాక్లెట్లో ఒకే ప్రయోజనాలు ఉన్నప్పటికీ వీటిని తీసుకోవడం వల్ల కొన్ని రకాల తేడాలు శరీరంలో కనిపిస్తాయి. ఖర్జూరలో పోషకాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇందులో చక్కెర నిల్వలు ఎక్కువగా ఉంటాయి. చక్కెర స్థాయి నిలువలు ఎక్కువగా ఉండడంతో వీటిని మధుమేహం ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు తీసుకోవడం కుదరదు. కానీ డార్క్ చాక్లెట్ లో చక్కర స్థాయి నిలువలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఖర్జూర కంటే డార్క్ చాక్లెట్ మేలని తెలుస్తుంది. కానీ కొందరికి డార్క్ చాక్లెట్ తినడం ఇష్టం ఉండదు. ఇలాంటివారు దీని స్థానంలో ఖర్జూరలను తీసుకోవడం మంచిది. అంతేకాకుండా ఖర్జూర తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది. డార్క్ చాక్లెట్ కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో మాత్రమే లభిస్తుంది. డార్క్ చాక్లెట్లు ఎక్కువగా తినడానికి ఆసక్తి ఉండదు. కానీ ఖర్జూర మాత్రం ఎన్నైనా తినాలని అనిపిస్తుంది. దేనికి అదే ప్రయోజనం ఉన్నప్పటికీ చెక్కర స్థాయి నిలువల విషయంలో మాత్రం డార్క్ చాక్లెట్ మేలని అనుకోవచ్చు.