God Will Fight For You: మానవ జీవితం ఎన్నో ఒడిదడుగులను ఎదుర్కొంటూ ఉంటుంది. ఒక వ్యక్తి ఒక పని పూర్తి చేయడానికి అనేక ఆటంకాలు రావచ్చు. అయితే వాటిని తట్టుకొని ముందుకు వెళ్లిన వారే విజయం సాధిస్తారు. ఇలాంటి సమయంలో ఓర్పు చాలా అవసరం. కొంతమంది తాము ఎలా ప్రవర్తిస్తున్నా.. దేవుడికి పూజలు చేయడం ద్వారా తమ పాపాలన్నీ తొలగిపోతాయని అనుకుంటారు. అయితే ఓవైపు పూజలు చేస్తూనే మరోవైపు ద్వేషాలను పెంచుకుంటూ ఉంటారు. ఆడంబరంగా పూజలు నిర్వహించినా.. మరోవైపు ద్వేషం పెంచుకోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. అయితే తాము ఏ తప్పు చేయకపోయినా కొందరు తమను నిందిస్తున్నారని.. వారిపై పగ పెంచుకొని కక్ష తీర్చుకోవాలని అనుకుంటారు. ఇలాంటి సమయంలో దేవుడిపై భక్తి ఉంటే.. దేవుడిని మాత్రమే కొలవాలి.. కానీ కొందరు ఓవైపు పూజలు చేస్తూనే మరోవైపు కక్షలు పెంచుకుంటారు. ఇలా చేస్తే ఏం జరుగుతుందంటే?
సమాజంలో రకరకాల మనసులు ఉంటారు. అందరూ మంచివారు అనడానికి వీలులేదు. కొందరు ఎంత మంచిగా ప్రవర్తించినా తమకు ఏదో రకంగా శత్రువులు పుట్టుకొస్తారు. ఈ శత్రువులపై పోరాటం చేయడానికి వారిపై కక్ష పెంచుకొని వంచించాలని అనుకుంటారు. మరికొందరు మాత్రం తమకు ఆసక్తి లేదని ఊరుకుంటారు. అయితే ఇంకొందరు మాత్రం.. ఓవైపు ప్రశాంతంగా దేవుడిని కొలుస్తూనే.. మరోవైపు కక్షలను పెంచుకుంటారు. ఇలా చేయడం వల్ల చేసే పూజలకు ఎలాంటి ఫలితం ఉండదు.
Also Read: Enemies: శత్రువుతో ఇలా ప్రవర్తిస్తే విజయం మీదే..
నిజంగా ఒక వ్యక్తి ఎలాంటి తప్పు చేయకపోయినా తాను మోసపోతే.. లేదా ఇతరుల ద్వారా నిందించబడితే.. ఆ వ్యక్తి మనస్ఫూర్తిగా దేవుడిని కొలవడం వల్ల.. ఆ దేవుడు అతనికి సహకరించే అవకాశం ఎక్కువగా ఉంది అని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. మనస్ఫూర్తిగా పూజలు చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాకుండా ఎలాంటి ద్దేశం లేకుండా ఎదుటి వ్యక్తిపై ప్రేమను పెంచుతూ ఉంటారు. ఇలా ఉండడంవల్ల కొందరు శత్రువులుగా ఉన్నా.. వారు మిత్రులుగా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇంకొందరు మాత్రం అనవసరంగా నిందిస్తూ ఉంటారు. ఇలాంటి వారికి దేవుడు సరైన బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిందింపబడే భక్తుడు మనస్ఫూర్తిగా దేవుళ్లను కొలవడం వల్ల ఆ దేవుడు ఆ భక్తులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాడు. అలాంటప్పుడు శత్రువుల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేదు. దేవుడిని మనస్ఫూర్తిగా పూజిస్తే చాలు.. ఆ దేవుడే అన్నీ చూసుకుంటాడు.
అలాకాకుండా మనసులో ద్వేషాన్ని పెంచుకొని ఇతరులపై కక్ష పెంచుకోవడం వల్ల.. ఇంకొందరి దృష్టిలో శత్రువులుగా మారిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా శత్రువును ఎక్కడో ఒకచోట ఉంచడం ద్వారా.. ఆ శత్రువు మొక్క పెరగకుండా ఉంటుంది. అలా కాకుండా వారిని రెచ్చగొట్టడం వల్ల.. అది మహావృక్షంగా మారి ఇబ్బందులకు గురిచేస్తుంది. అందువల్ల శత్రువుల గురించి ప్రత్యేకంగా ఆలోచించకుండా మనస్ఫూర్తిగా దేవుడిని కొనడం వల్ల అంతా స్వామియే చూసుకుంటాడని ఆధ్యాత్మిక వాదులు చెబుతున్నారు.