Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి పై హరీశ్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్ర సీఎం కు కృష్ణానదిపై కనీస అవగాహన లేదని అన్నారు. కృష్ణా బేసిన్ లో రాష్ట్రా వాటా 763టీఎంసీలు రావాలని బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యూనల్ ముందు కేసీఆర్ పోరాడితే రేవంత్ 500 టీఎంసీలు ఇస్తే చాలంటున్నారని అన్నారు. ఒకవేళా అలా జరిగితే ట్రైబ్యునల్ ముందు వాదనలు వీగిపోవడంతోపాటు రాష్ట్రం ఎంతో నష్టపోతుందన్నారు. రాష్ట్ర హక్కులను సీఎం ఏపీ పాలకులకు రాసిస్తా అంటే ఊరుకోబోమని హెచ్చరించారు.
కేసీఆర్ సముద్రంలో కలిసే 3000 టీఎంసీ నీళ్ళల్లో 1950 టీఎంసీల నీళ్ళు కావాలని కేంద్ర జలవనరుల శాఖకు లేఖ రాసారు
రేవంత్ రెడ్డి మాత్రం 1000 టీఎంసీలు ఇచ్చి మొత్తం తీసుకో అని చంద్రబాబుకు దాసోహం అవుతున్నాడు – హరీష్ రావు pic.twitter.com/soXAEMJRMS
— Telugu Scribe (@TeluguScribe) June 19, 2025