Anger Management: మనం ఇంట్లో ప్రతి విషయంలో వాస్తు పద్ధతులు పాటిస్తుంటాం. ఇంటి నిర్మాణంలో కానీ వస్తువుల అమర్చుకోవడంలో కానీ వాస్తు ప్రకారం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం. మన ఇంట్లో వాస్తు సరిగా లేకపోతే ప్రతి విషయంలో చిరాకు పడుతుంటారు. ప్రతికూల శక్తులు ఉంటే తరచుగా కోపం వస్తుంటుంది. ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ కారణంగా మనకు చిరాకు, కోపం పెరుగుతుంటాయి.
ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడాలంటే చిన్ని చిన్న పరిహారాలు పాటించాలి. కోపాన్ని నియంత్రించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. ఇంట్లో మురికి ఎక్కువగా ఉంటే కోపం వస్తుంది. దీంతో మనకు సహజంగానే ఆగ్రహం ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఉదయం కళ్లు తెరిచిన వెంటనే అరచేతులను కళ్లకు అద్దుకోవాలి. భగవంతుడిని ప్రార్థించి భూమాతకు నమస్కారం చేయాలి.
మనం ఆగ్నేయ దిశలో తల పెట్టి నిద్రించకూడదు. ప్రతి రోజు సాయంత్రం ఇంటి తూర్పు దిక్కున దీపం వెలిగించడం మంచిది. దీంతో ప్రతికూల వాతావరణం తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. పడక గది గోడలకు ముదురు రంగు వేయకూడదు. లేత రంగులు వేయాలి. ముదురు రంగులు వేస్తే విపరీతమైన కోపం వస్తుంది. ప్రతి రోజు చంద్రునికి అర్జమివ్వడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
ప్రతి రాత్రి చంద్రుడిని పూజించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. పడక గది మూల ఒక చిన్న గిన్నెలో రాతి ఉప్పును నింపి పెట్టాలని చెబుతుంటారు. రాతి ఉప్పును నీళ్లలో వేసి తుడవడం వల్ల ఇంట్లో చిరాకు తొలగిపోతుంది. ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఇలా ఇంట్లో చిన్న పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది.