Ramiz Raja: మన దాయాది దేశం పాకిస్తాన్ సైన్యం సరిహద్దుల్లో తరచూ భారత సైనికులను కవ్విస్తూనే ఉంటుంది. భారతదేశంలో ఎలా అల్లర్లు సృష్టించాలి, అశాంతి రగిల్చాలి, హింసకు పాల్పడాలని కుటిల ప్రయత్నాలు చేస్తుంది పాకిస్తాన్. ఆదేశ క్రికెటర్లు కూడా కూడా అదేతీరుగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. క్రీడాస్ఫూర్తిని చాటాల్సిన వెటరన్ క్రికెటర్ రమీజ్‌రాజా ఆసియాకప్ సందర్భంగా ఇండియా జర్నలిస్టుతో వ్యవహరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాజీ క్రికెటర్‌ను భారతీయులు ట్రోల్ చేస్తున్నారు.

ఉన్నత పదవిలో ఉండి..
ఆసియా కప్–2022లో శ్రీలంక చేతిలో ఓడిన పాకిస్తాన్ కు దిమ్మతిరిగింది. ఫైనల్‌లో పాకిస్తాన్.. 23 పరుగుల తేడాతో ఓడింది. ఆకలితో అలమటిస్తున్న, రాజకీయ సంక్షోభంతో దేశం అల్లకల్లోలంగా ఉన్నా ఆ దేశ క్రికెటర్లు మాత్రం ఆసియాకప్‌లో సమష్టిగా రాణించారు. ఐక‍్యంగా ఉంటే విజయం వరిస్తుందని నిరూపించారు. ఆర్థిక సంక్షోభ సమయంలో దేశ ప్రజలకు ఈ విజయంతో కాస్త ఊరటనిచ్చారు. అయితే ఈ జట్టు చేతిలో ఓడిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్Œ, ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రజా అనుచిత ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. ఆయన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మ్యాచ్ చూద్దామని వచ్చి..
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి రమీజ్‌రాజా ఆదివారం దుబాయ్‌కు వచ్చాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతడికి బయిటకు వచ్చాక విలేకరుల నుంచి ప్రశ్నల వర్షం ఎదురైంది. కానీ అప్పటికే పాక్ ఓటమితో ఉన్న రమీజ్‌రాజా వారికి సమాధానం చెప్పలేక అక్కడి నుంచి జారుకోవాలని చూశాడు. ఈ క్రమంలో ఓ జర్నలిస్టు.. ‘పాకిస్తాన్ లో ప్రజలు ఈ ఓటమితో బాధపడుతున్నారా..?’ అని ప్రశ్నించాడు. దానికి రమీజ్ రాజా స్పందిస్తూ.. ‘నువ్వు తప్పకుండా ఇండియన్‌వే అయి ఉంటావ్.. మేం మ్యాచ్ ఓడిపోతే నువ్వు హ్యాప్పీయేనా..?’ అని సదరు జర్నలిస్టుతో అన్నాడు. అక్కడితో ఆగకుండా జర్నలిస్టు చేతిలో ఉన్న ఫోన్‌ను చేతితో లాగాడు. ఇంక తననెవరూ ఏ ప్రశ్న వేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెళ్తున్న క్రమంలో జర్నలిస్టు ఫోనును అతడి చేతిలో పెట్టాడు.

ట్రోల్ చేస్తున్న ఇండియన్స్
రమీజ్ రాజా ప్రవర్తనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని ఇండియన్స్ ట్రోల్ చేస్తున్నారు. రమీజ్‌పై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రమీజ్ రాజా ముందు సహనంగా ఉండటం నేర్చుకోవాలని వాళ్లు సూచిస్తున్నారు. సదరు జర్నలిస్టు తప్పుగా ఏమీ అడగలేదని.. అంతమాత్రానికే రమీజ్ రాజా అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఉన్నమాట అంటే రమీజ్ రాజాకు ఉలుకెందుకని ప్రశ్నిస్తున్నారు. పొరుగు దేశంతో స్నేహం కోరుకోవాల్సిన వ్యక్తి.. కవ్వించడం ఏంటని నిలదీస్తున్నారు.