Sushmita Sen- Lalit Modi Breakup: లేటు వయసులో ఘాటు ప్రేమలో పడిన సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ – లలిత్ మోడీ మళ్ళీ వార్తలో నిలిచారు. నెల క్రితం తమ రొమాంటిక్ ఎపిసోడ్ తో సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసిన ఈ జంట, ఇప్పుడు ఆలోచనలో పడేశారు. లలిత్ మోడీ ప్రేమ ఫలితంగా తనకు ఉన్న ఇమేజ్ డ్యామేజ్ అయిందని సుస్మితా సేన్ తెగ ఇదైపోతుంది. ఆయనగారితో డేటింగ్ లో ఉన్నప్పుడు ఈ ఆంటీకి తత్త్వం బోధపడలేదు. బంధం బజారున పడ్డాకే సుస్మితా సేన్ కి నెప్పి తెలిసొచ్చింది.

మొత్తమ్మీద సుస్మితా సేన్ – లలిత్ మోడీ ముదురు జంట ఇప్పుడు విడిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ విడివిడిగానే కనిపిస్తున్నారు. నిజానికి లలిత్ మోడీ తో లవ్ కారణంగా సుస్మితా సేన్ బాగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇండియాలో అతను స్కామ్ చేసి పారిపోవడం, ఆ స్కామ్ తాలూకు కేసులు ఇంకా రన్నింగ్ లో ఉండటం.. అవన్నీ కలిపి సుస్మితా సేన్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అందుకే, సైలెంట్ గా సుస్మితా సేన్, లలిత్ మోడీకి హ్యాండ్ ఇచ్చింది.
దానికి తోడు సుస్మితా సేన్, లలిత్ మోడీతో బంధం పై బాగా అసంతృప్తిగా ఉందట. అతగాడికి వయసు పెరగడం, పైగా అతని వల్ల ఎలాంటి సుఖం లేకపోవడం, ఇక ఆర్ధికంగా కూడా అతను ఇప్పుడు గొప్ప స్థాయిలో లేకపోవడం.. మొత్తానికి సుస్మితా సేన్, లలిత్ మోడీని ఛీ కొట్టింది. ఏది అయితే ఏం ఈ ఇద్దరూ విడిపోయారు. అయినా సుస్మితకు ఎఫైర్లు కొత్త కాదు. గతంలో అనేక రిలేషన్ షిప్ లతో సేద తీరింది.

తన సహనటులతో సుస్మితా సేన్ కు చాలా ఘాటు అనుబంధం ఉంది. కొందరితో సహజీవనం కూడా చేసింది. ప్రస్తుతం కూడా సుస్మితా సేన్, ఓ బాలీవుడ్ మోడల్ తో డేటింగ్ లో ఉంది. అన్నట్టు సుస్మిత పెళ్లి చేసుకోకుండా అనాథ పిల్లలను దత్తత కూడా తీసుకుంది. ఇక లలిత్ మోడీ విషయానికి వస్తే.. లలిత్ మోడీకి గతంలో పెళ్లైంది.
తన కన్నా వయసులో పెద్దదైన ఒక మహిళను లలిత్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె మరణించింది. దాంతో లలిత్ మోడీ ఒంటరివాడు అయిపోయాడు. అందుకే, లేటువయసులో మరో బంధాన్ని వెతుకున్నాడు. కానీ, విచిత్రంగా ఆ బంధం కూడా అతనికి ఎక్కువరోజులు నిలబడలేదు. మళ్లీ ఒంటరి వాడు అయిపోయాడు.