Astrology: నవంబర్ 8న చంద్రగ్రహణం ఏర్పడనుంది. అక్టోబర్ 25న సూర్య గ్రహణం ఏర్పడింది. దీంతో 15 రోజుల్లో రెండు గ్రహణాలు చోటుచేసుకోవడం అంత మంచిది కాదని చెబుతున్నారు. ఇలాంటి పరిణామాలు గతంలో చాలా ఏళ్ల క్రితం వచ్చాయని పండితుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో చంద్ర గ్రహణం సందర్భంగా పలు రాశులకు నష్టాలు కొన్ని రాశులకు మాత్రం శుభాలు కలగనున్నాయి. దీంతో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ 11న శుక్ర గ్రహం తన స్థానాన్ని మార్చుకుని వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుంది. మరోవైపు బుధుడు నవంబర్ 13 నుంచి వృశ్చిక రాశిలో సంచరించనున్నాడు. రెండు గ్రహాల స్థానాల మార్పు నాలుగు రాశులపై ప్రభావం చూపనుందని తెలుస్తోంది. ఒకే రాశిలో రెండు గ్రహాల సంచారం వల్ల నాలుగు రాశుల వారికి మేలు కలుగుతుందని చెబుతున్నారు.

వృషభ రాశి వారికి ఈ గ్రహణం మంచి ఫలితాలు కలిగించనుంది. ఈ రాశి వారికి శుక్ర, బుధ సంచారం వల్ల వివాహ యోగం ఏర్పడనుంది. వివాహానికి ఉత్తమ సమయం, వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. చంద్ర గ్రహణం వల్ల ఈ రాశి వారికి అన్నిరకాలుగా మంచి జరగనుంది. దీంతో వీరు అనుకున్నది సాధిస్తారు. అవాంతరాలను అధిగమిస్తారు. అనుకోని వార్తలు ఆనందం కలిగిస్తాయి. దీంతో ఈ రాశి వారికి పట్టిందల్ల బంగారమే అవుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
సింహరాశి వారికి కూడా అంతా మంచి జరగనుంది. శ్రేయస్సు కలిగిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించి లాభాలు గడిస్తారు. ఈ సమయం మీకు ఎంతో అనుకూలంగా ఉండటంతో సమయం మీకు అనుకూలంగా మారుతుంది. జీవితంలో అనుకున్నది సాధిస్తారు. కాలం మీకు సహకరిస్తుంది. అన్ని పనుల్లో అవాంతరాలు తొలగి పనులు త్వరగా పూర్తవుతాయి. భూమికి సంబంధించిన లావాదేవీలు కూడా మీకు ఉపయుక్తంగా ఉంటాయి. ఈ కాలం మీకు ఎన్నో లాభాలు తెచ్చిపెడుతుంది.

మకరరాశి వారికి కూడా ఎన్నో లాభాలున్నాయి. శుక్ర, బుధ గ్రహాల సంచారం వల్ల మేలు కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నతులు, సంపాదన పెరిగే అవకాశముంది. ఫ్యాషన్, డిజైన్ రంగాల్లో ఉన్న వారికి ఎంతో ప్రయోజనం పొందడం ఖాయం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీకోరికలు నెరవేర్చుకోవడానికి ఇది సరైన సమయం. కార్యాలయంలో తోటి ఉద్యోగుల మద్దతు లభిస్తుంది. దీంతో మీరు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.
కుంభరాశిలో ఉన్న వారికి కూడా చంద్రగ్రహణం మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ రాశి వారికి కెరీర్ లో అన్ని విజయాలు లభిస్తాయి. భవిష్యత్ తీర్చి దిద్దుకోవడానికి ఎన్నో రకాల మేలు కలుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశముంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే వీలుంది. ఈ నేపథ్యంలో చంద్ర గ్రహణం మంచి ఫలితాలు అందించనుంది.