RRR Japan Collections: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం ఈ ఏడాది విడుదలై ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి సంచలనం సృష్టించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇతర దేశాలలో కూడా ఈ సినిమాకి OTT నుండి అపూర్వమైన ఆదరణ దక్కడం తో ఈమధ్యనే జపాన్ లో ఈ సినిమాని భారీ గా విడుదల చేసారు మూవీ టీం..ఎదో విడుదల చేసాం అంటే విడుదల చేసాము అన్నట్టు కాకుండా మూవీ టీం మొత్తం జపాన్ కి వెళ్లి సుమారు పది రోజులపాటు అక్కడి మీడియా కి ఇంటర్వూస్ మరియు ప్రొమోషన్స్ ఇచ్చారు.

జపాన్ లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వాళ్లిద్దరూ మన ఇండియా లో తిరిగితే అభిమానుల తాకిడి ఏ స్థాయిలో ఉంటుందో..జపాన్ లో కూడా అదే రేంజ్ ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు..ఇది ఇలా ఉండగా ఇప్పటికి ఈ సినిమా విడుదలై వారం రోజులు పూర్తి కావొచ్చింది..మొదటి రోజు జపాన్ లో సెన్సషనల్ ఓపెనింగ్ ని దక్కించుకున్న ఈ చిత్రం మొదటి వారం లో ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
పది రోజులకు గాను జపాన్ లో ఇప్పటి వరుకు ఈ సినిమా 2 వందల జపనీస్ డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది అనే చెప్పాలి..జపనీస్ డాలర్స్ మన ఇండియన్ కరెన్సీ తో పోలిస్తే చాలా తక్కువ..ఈ రెండు వందల మిలియన్ డాలర్లను ఇండియన్ కరెన్సీ లెక్కల్లో చూస్తే ఆరు కోట్ల రూపాయిల గ్రాస్ అన్నమాట..అదే విధంగా అమెరికన్ కరెన్సీ లో చూస్తే 7 లక్షల 50 వేల డాలర్లు అని చెప్పొచ్చు.

ఇప్పటి వరుకు ఇక్కడ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ముత్తు సినిమాకి దాదాపుగా 450 కి పైగా మిలియన్ డాలర్లు వసూలు చేసింది..ఆ తర్వాత బాహుబలి 2 చిత్రం 300 మిలియన్ డాలర్లు వసూలు చేసింది..మరి #RRR ఈ రెండు సినిమాల రికార్డ్స్ ని బద్దలు కొడుతుందా లేదా అనేది చూడాలి..ప్రస్తుతానికి ఈ సినిమా వసూళ్లు స్టడీ గానే ఉన్నాయి..మొదటి వీకెండ్ ఎంత వసూళ్లను రాబట్టిందో రెండవ వీకెండ్ కూడా అదే స్థాయి వసూళ్లను రాబట్టింది..ఇదే ట్రెండ్ ని రాబొయ్యే రోజుల్లో కూడా కొనసాగిస్తే కచ్చితంగా బాహుబలి 2 రికార్డు ని బద్దలు కొట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.