Homeబిజినెస్Automobile: కొత్త కారు, బైక్ నెలాఖరు వరకే కొనేయండి.. లేకుంటే మోత తప్పదు

Automobile: కొత్త కారు, బైక్ నెలాఖరు వరకే కొనేయండి.. లేకుంటే మోత తప్పదు

Automobile
CARS

Automobile: ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్లాలంటే కాలినడికే శరణ్యం. తర్వాత సైకిల్ వచ్చింది. ఆ తర్వాత మోటార్ బైక్, మరి కొన్ని రోజుల తర్వాత కారు, తర్వాత హెలికాప్టర్, విమానం..ఇలా సౌకర్యాలు పెరుగుతున్నకొద్దీ.. మనిషి జీవనం మరింత సుఖమయం అయింది. కాకపోతే వెనకటి రోజుల్లో ఈ ప్రయాణ సాధనాలు మొత్తం సంపన్న వర్గాలకే దక్కేవి. కానీ లైసెన్స్ రాజ్ చట్టంలో మార్పులు తీసుకురావడంతో సరళికృత పారిశ్రామిక విధానం అమల్లోకి వచ్చింది. దీంతో సంపన్నులకే పరిమితమైన ప్రయాణ సాధనాలు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. కంపెనీలు పెరగడం, వాడకం అధికమవడంతో.. వివిధ రకాల ప్రయాణ సాధనాలకు డిమాండ్ ఏర్పడింది.. ప్రభుత్వ ప్రోత్సాహకాల ఫలితంగా పలు రకాల కంపెనీలు కూడా ఉత్పత్తులను పెంచడం ప్రారంభించాయి.. ఇదే సమయంలో కాలుష్యం పెరగడంతో ప్రభుత్వం దాని నివారణకు నడుం బిగించింది.. మరీ ముఖ్యంగా గత ఐదేళ్లలో వాహనాల వినియోగం తారాస్థాయికి చేరింది.. ఈ క్రమంలో పెరుగుతున్న కాలుష్యానికి కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలకు తెర లేపింది.

వెంటనే కొనేయండి

కారు, లేదా బైక్‌ కొనాలనుకుంటున్నారా?. వెంటనే తొందరపడండి. ఈ నెలాఖరులోపే కొనేయండి. లేదంటే మీ జేబుకు మరింత చిల్లు తప్పదు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఆటోమొబైల్‌ కంపెనీలు మరో విడత ధరలు పెంచేస్తున్నాయి. దీంతో మోడల్‌ను బట్టి పెట్రోల్‌ కారు అయితే రూ.15,000 నుంచి రూ.20,000 వరకు, డీజిల్‌ కార్లయితే రూ.65,000 నుంచి రూ.70,000 వరకు అదనంగా ఖర్చు చేయాలి. మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉపయోగించే టూ వీలర్ల ధర కూడా ఏప్రిల్‌ 1 నుంచి 3 శాతం వరకు పెరగనుంది. దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతి సుజుకీ ఏప్రిల్‌ నుంచి ధరలు పెంచుతామని చెప్పినా.. ఎంత పెంచేది మాత్రం వెల్లడించలేదు. హోండా కార్స్‌ ఇండియా మాత్రం తన ఎంట్రీ లెవల్‌ కాంపాక్ట్‌ సెడాన్‌ అమేజ్‌ ధర ఏప్రిల్‌ 1 నుంచి రూ.12,000 వరకు పెంచుతున్నట్టు తెలిపింది. కంపెనీ ఉత్పత్తి చేసే మోస్ట్‌ పాపులర్‌ మిడ్‌ సైజ్‌ సెడాన్‌ ‘సిటీ’ ధరను మాత్రం యథాతథంగా ఉంచింది. మరోవైపు హీరో మోటోకార్ప్‌ తన ఉత్పత్తుల ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

వాణిజ్య వాహనాలపైనా..

కార్లతో పోలిస్తే.. ఈసారి వాణిజ్య వాహనాల (సీవీ) ధరల పెంపు ఎక్కువగా ఉండనుంది. ఏప్రిల్‌ 1 నుంచి కార్ల ధరలు రెండు నుంచి 4 శాతం పెరిగితే, సీవీల ధరలు మాత్రం 5 శాతం వరకు పెరగనున్నాయి. టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం), అశోక్‌ లేలాండ్‌ కంపెనీలు ఇందుకు సంబంధించి ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం.
టాటా మోటార్స్‌ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే పెంచిన ధరలతో మార్కెట్లో బీఎస్‌6 ఫేజ్‌-2 వాహనాలు విడుదల చేస్తోంది. ఉత్పత్తి ఖర్చులు పెరిగాయనే పేరుతో ఏప్రిల్‌ నుంచి తన వాహనాల ధరల్ని మరో 2-3 శాతం పెంచబోతున్నట్టు భావిస్తున్నారు.
ఉత్పత్తి ఖర్చులు పెరగడం, బీఎస్‌6 ఫేజ్‌-2 నిబంధనల ప్రకారం కార్లు వెదజల్లే కాలుష్య పరిమాణాన్ని సూచించే ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేయాల్సి రావడంతో ధరలు పెంచక తప్పడం లేదని కంపెనీల వాదన. ఈ ఖర్చుల్లో కొంతైనా కొనుగోలుదారులకు బదిలీ చేయక తప్పడం లేదని చెబుతున్నాయి. లగ్జరీ కార్ల కంపెనీలైతే డాలర్‌తో రూపాయి మారకం రేటు బక్కచిక్కడమూ ఇందుకు కారణమంటున్నాయి.

Automobile
Automobile

బీఎస్‌6 ఫేజ్‌-2 నిబంధనలు

నిజానికి 2020 ఏప్రిల్‌ నుంచే మన దేశంలోని ఆటోమొబైల్‌ పరిశ్రమ బీఎస్‌6 కాలుష్య ప్రామాణికాలు అమలు చేస్తోంది. ఇప్పుడు ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌6 ఫేజ్‌-2 అమలు చేయబోతున్నారు. ఈ నిబంధనల ప్రకారం ఏప్రిల్‌ 1 నుంచి కంపెనీల నుంచి బయటికి వచ్చే ప్రతి వాహనం ‘ది రియల్‌ డ్రైవింగ్‌ ఎమిషన్‌’ (ఆర్‌డీఈ) ఇంధన ప్రామాణికాలు పాటించాలి. ఇందుకోసం ప్రతి వాహనంలో ఒక ప్రత్యేక పరికరం అమరుస్తారు. ఆ వాహన కాలుష్యం బీఎస్‌6 ఫేజ్‌-2 పరిమితులు మించిన వెంటనే ఈ పరికరం డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. దాంతో వాహన యజమాని ఆ వాహనాన్ని సర్వీస్‌ కోసం పంపించక తప్పదు. ఈ పరికరం ఏర్పాటు కోసం అదనంగా ఖర్చవుతున్నందున అందులో కొంత భాగాన్ని వాహన కొనుగోలుదారులకు బదిలీ చేయక తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి.

మరింత ప్రియం

ఆటోమొబైల్‌ కంపెనీలు చాలావరకు లగ్జరీ కార్లలో ఇప్పటికే ది రియల్‌ డ్రైవింగ్‌ ఎమిషన్‌ (ఆర్‌డీఈ) పరికరాలు అమర్చాయి. అయినా ఏప్రిల్‌ 1 నుంచి ఈ కార్ల ధర మరింత పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. మెర్సిడెజ్‌ బెంజ్‌ ఇండియా ఇప్పటికే ఏప్రిల్‌ 1 నుంచి తన కార్ల ధరలు ఐదు శాతం మేర పెంచనున్నట్టు ప్రకటించింది. మరో లగ్జరీ కార్ల కంపెనీ ‘లెక్సస్‌’ మాత్రం వేచి చూసే ధోరణిలో ఉంది.

లేదంటే మీ జేబుకు మరింత చిల్లు తప్పదు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఆటోమొబైల్‌ కంపెనీలు మరో విడత ధరలు పెంచేస్తున్నాయి. దీంతో మోడల్‌ను బట్టి పెట్రోల్‌ కారు అయితే రూ.15,000 నుంచి రూ.20,000 వరకు, డీజిల్‌ కార్లయితే రూ.65,000 నుంచి రూ.70,000 వరకు అదనంగా ఖర్చు చేయాలి. మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉపయోగించే టూ వీలర్ల ధర కూడా ఏప్రిల్‌ 1 నుంచి 3 శాతం వరకు పెరగనుంది. దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతి సుజుకీ ఏప్రిల్‌ నుంచి ధరలు పెంచుతామని చెప్పినా.. ఎంత పెంచేది మాత్రం వెల్లడించలేదు.

హోండా కార్స్‌ ఇండియా మాత్రం తన ఎంట్రీ లెవల్‌ కాంపాక్ట్‌ సెడాన్‌ అమేజ్‌ ధర ఏప్రిల్‌ 1 నుంచి రూ.12,000 వరకు పెంచుతున్నట్టు తెలిపింది. కంపెనీ ఉత్పత్తి చేసే మోస్ట్‌ పాపులర్‌ మిడ్‌ సైజ్‌ సెడాన్‌ ‘సిటీ’ ధరను మాత్రం యథాతథంగా ఉంచింది. మరోవైపు హీరో మోటోకార్ప్‌ తన ఉత్పత్తుల ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular