https://oktelugu.com/

Friendship: ఆ నలుగురితో స్నేహం.. కష్టాలు తెచ్చుకోవడమే..

అహంతో నిండిన స్వభావం ఉన్న వ్యక్తికి ఎప్పుడూ మద్దతు ఇవ్వకూడదని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వారు పిల్లిలా ఉంటారు తమను తాము గొప్పగా కనిపించేలా చేసుకోవడానికి నమ్మిన స్నేహితుల ఇమేజ్‌ పాడుచేస్తారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 2, 2024 / 02:25 PM IST

    Friendship

    Follow us on

    Friendship: ప్రపంచంలో స్నేహానికి మంచి విలువ ఉంది. తల్లిదండ్రుల తర్వాత అంతటి విలువ స్నేహితులకే ఉంటుంది. మన కష్ట సుఖాలను పంచుకునేది మంచి స్నేహితుడే. అయితే కొన్నిసార్లు స్నేహితులు కూడా శత్రువులగా మారతారు. కొంతమందిని స్నేహం నటిస్తూ.. మోసం చేసి వెళ్లిపోతారు. అందుకే జీవితంలో ఏ వ్యక్తులకు దూరంగా ఉండాలి? ఎవరితో స్నేహం చేయాలి? అని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో స్పష్టంగా తెలియజేశాడు. వాటిని మనకు అన్వయించుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. స్నేహం గురించి చాణక్యుడు చెప్పిన మంచి విషయాలు తెలుసుకుందాం.

    తెలివితక్కువ వ్యక్తులకు దూరంగా ఉండాలి..
    ఆచార్య చాణక్యుడు మూర్ఖుడిని జంతువుగా అభివర్ణించాడు. మానవుడే అయినా తెలివి, విచక్షణ లేనివాడు పశువుతో సమానం. అందుకే వారితో సహవాసం చేయకూడదు. అలాంటి వారితో స్నేహం చేస్తే సమస్యలు చుట్టుముడతాయి. మూర్ఖుడైన స్నేహితుడు కంటే తెలివైన శత్రువు మంచివాడు.

    అహంకారిని దూరం పెట్టాలి..
    అహంతో నిండిన స్వభావం ఉన్న వ్యక్తికి ఎప్పుడూ మద్దతు ఇవ్వకూడదని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వారు పిల్లిలా ఉంటారు తమను తాము గొప్పగా కనిపించేలా చేసుకోవడానికి నమ్మిన స్నేహితుల ఇమేజ్‌ పాడుచేస్తారు. అవమానించడానికీ వెనుకాడరు. ధనం లేక జ్ఞానంతో అహంకారం లేనివారితో స్నేహం చేయాలి.

    అత్యాశపరులతో ప్రమాదం..
    జీవితంలో అత్యాశపరులకు మద్దతు ఇవ్వకూడదు. మీతో సమానమైన వ్యక్తులతో స్నేహం చేయండి. తనకంటే బలహీనమైన, అత్యాశ కలిగిన వ్యక్తికి దూరంగా ఉండాలి. అత్యాశ పరులు సొంత ప్రయోజనాల కోసం మిమ్మల్ని విడిచిపెడతారు. ప్రత్యర్థితో చేతులు కలుపుతారు. ఉన్నంతలో సంతృప్తిగా ఉండేవారితో మాత్రమే స్నేహం పెంచుకోవాలి.

    చెడ్డవారు ఎప్పుడూ మోసం..
    ఆచార్య చాణక్యుడు తన విధానంలో చెడ్డ వ్యక్తిని ఎప్పుడూ తనతో ఉంచుకోకూడదని చెప్పాడు. అలాంటి వారు పాము కన్నా ప్రమాదకరం. పాము అవతలి వ్యక్తి తనకు హాని కలిగించినప్పుడు మాత్రమే కాటేస్తుంది. దుష్డుడికి ఆ విశ్వాసం కూడా ఉండదు. ఇలాంటివారు ద్రోహం చేసి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. అందుకే సంస్కారవంతమైన వ్యక్తులతో స్నేహం చేయాలి.