Eating: ఈ ఐదుగురితో భోజనం చేయొద్దు.. చేస్తే ఏమవుతుందో తెలుసా

మన పురాణాల ప్రకారం భోజనం చేసే సమయంలో మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. అబద్ధం చెప్పే వ్యక్తులతో కూర్చుని ఎన్నడూ భోజనం చేయరాదు.అబద్ధాలు చేప్పే వ్యక్తులు విషపూరితమైన ఆలోచనలు కలిగి ఉంటారు.

Written By: Raj Shekar, Updated On : May 2, 2024 2:31 pm

Eating

Follow us on

Eating: భోజనం ప్రతీ జీవి జీవితంలో ముఖ్యమైన భాగం. తినే ఆహారంతో శరీరానికి విటమిన్స్, మినరల్స్, కొవ్వు పదార్థాలు లభిస్తాయి. ఇక నిత్యం మన కుటుంబ సభ్యులతో, ఆఫీసులో కొలీగ్స్‌తో, పార్టీల్లో స్నేహితులతో, పని ప్రదేశాల్లో సహచర వర్కర్లతో కలిసి భోజనం చేస్తాం. అయితే మన శాస్త్రపురాణాల ప్రకారం ఐదుగురితో కలిసి భోజనం చేయకుడదట. ఇలా తినడం వలన తిన్న ఆహారం శరీరానికి మనసుకు తగిన ఫలాన్ని ఇవ్వదట. భోజనం చేయకూడని ఆ ఐదు మంది ఎవరో తెలుసుకుందాం..

అబద్ధం చెప్పే వారితో..
మన పురాణాల ప్రకారం భోజనం చేసే సమయంలో మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. అబద్ధం చెప్పే వ్యక్తులతో కూర్చుని ఎన్నడూ భోజనం చేయరాదు.అబద్ధాలు చేప్పే వ్యక్తులు విషపూరితమైన ఆలోచనలు కలిగి ఉంటారు. వీరికి నైతికత గురించి తెలియదు. అందుకే పురాణాలు వీరితో భోజనం చేయకూడదని చెబుతున్నాయి.

ఆనారోగ్యంతో బాధపడేవారితో..
ఇక ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వారితో కలిసి భోజనం చేయరాదని పురాణాలు చెబుతున్నాయి. అనారోగ్యంతో బాధపడే వారి శరీరంలో కొన్ని రకాల బ్యాక్టీరియా ఉంటుంది. వారితో కలిసి భోజనం చేయడం వలన ఆ ప్రభావం ఆరోగ్యంగా ఉన్నవారిపై కూడా చూపిస్తుంది.

నేర స్వభావం ఉన్నవారితో..
పురాణాల ప్రకారం నేర ప్రవృత్తి ఉన్నవారితో కలిసి భోజనం చేయవద్దు. ఆలోచనలలో ప్రతికూలత ఉన్నవారితో భోజనం చేయరాదు. వీరు ఉన్న ప్రదేశంలో నెగిటివ్‌ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ప్రశాంత చిత్తంతో ఉండేవారితో భోజనం చేయడం వలన మేలు జరుగుతుంది.

నాస్తికులతో..
పురాణాల ప్రకారం నాస్తికులతో కలిసి భోజనం చేయరాదు. దైవంపై నమ్మకం లేనివారితో భోజనం చేస్తే ఆ ప్రభావం మనపై కూడా పడుతుంది. ఆపదలు చుట్టుముడతాయి. గరుడ పురాణం ప్రకారం నాస్తికుడితో కలిపి భోజనం చేయరాదు.