Shane Warne Passed Away: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ కన్నుమూశారు. ఆస్ర్టేలియా క్రికెట్ కు ఆయన అందించిన సేవలు అనిర్వచనీయం. అనుసరణీయం. ఆస్ర్టేలియా జట్టుకు విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించేవాడు. జట్టును ఆపదల సమయంలో గట్టెక్కించిన అతడు ఎన్నో చిరస్మరణీయమైన గెలుపుల్లో అతడి భాగస్వామ్యం ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో షేన్ వార్న్ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో క్రికెట్ అభిమానుల్లో కలవరం కలుగుతోంది. షేన్ వార్న్ ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.

షేన్ వార్న్ కొద్ది రోజులుగా థాయిలాండ్ లోని కోహ్ సామూయ్ లోని ఓ ప్రైవేటు విల్లాలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అతడితో పాటు స్నేహితులు ముగ్గురు కూడా అతడి పక్కనే ఉంటున్నారు. రోజు సరదాగా బయటకు వెళ్లే స్నేహితులు శుక్రవారం కూడా బయటకు వెళ్లాలని భావించారు. దీంతో వారు ముగ్గురు స్నేహితులు అతడి కోసం ఎదురు చూశారు. కానీ ఎంతకూ రాకపోవడంతో అనుమానం వచ్చి చూసే సరికి అపస్మారక స్థితిలో పడిపోయాడు. దీంతో అంతా ఖంగుతిన్నారు.
Also Read: జగన్ 1000 రోజుల పాలన.. పాసయ్యాడా? ఫెయిలయ్యాడా?
తక్షణమే తేరుకుని అతడి చాతీపై కొట్టడం ప్రారంభించారు. గుండెపోటు వచ్చినప్పుడు ఇలా చేస్తే ఫలితం ఉంటుందని అనుకున్నా లాభం లేకపోయింది. షేన్ వార్న్ ఎంతకూ స్ర్పహలోకి రాకపోవడంతో ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వైద్యులు అతడు చనిపో యినట్లు నిర్ధారించారు. దీంతో అభిమానుల కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వార్న్ లేకపోవడం క్రికెట్ కు పెద్ద లోటని చెబుతున్నారు. అతడు బతికుంటే క్రికెట్ కోసం ఎన్నో రకాలుగా సేవలందించేవారని చెబుతున్నారు.
షేన్ వార్న్ ను మరణం అంచులనుంచి కాపాడాలని అతడి స్నేహితులు చేసిన ప్రయత్నం సఫలం కాలేదు. చివరకు అతడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోవడంతో అందరు శోకించారు. ఇన్నాళ్లు తమ ప్రియతమ నేస్తం తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. క్రికెట్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. దాదాపు ఇరవై నిమిషాల పాటు వారు చేసిన ప్రయత్నం విఫలయత్నమే అయింది. కాలమే గెలిచింది. విధి ఆడిన నాటకంలో వార్న్ పాత్రధారి కావడం గమనార్హం.
Also Read: బీజేపీ నేతలపై కేసులు..? టీఆర్ఎస్ ది కుట్రపూరితమేనా?