https://oktelugu.com/

Jr NTR Fans: జూ.ఎన్టీఆర్ ను పిచ్చిగా అభిమానించే ఫ్యాన్స్ చేసిన పని ఇదీ!

Jr NTR Fans: హీరోలపై అభిమానం అన్నది ఇప్పటిది కాదు.. నాడు సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకూ నందమూరి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంతో మంది మనకు ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు అయితే ఫ్యాన్స్ కాదు.. ఆయనను దేవుడిగా అభిమానించే అపర భక్తులు ఉన్నారు. అయితే అంతకుమించిన ప్రేమను చూపించాడు ఒక అభిమాని. అతడి ప్రేమకు నిజంగానే జూ.ఎన్టీఆర్ సైతం ఫిదా కావాల్సిందే.. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని తన ఆరాధ్య హీరోపై […]

Written By: , Updated On : March 5, 2022 / 12:41 PM IST
Follow us on

Jr NTR Fans: హీరోలపై అభిమానం అన్నది ఇప్పటిది కాదు.. నాడు సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకూ నందమూరి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంతో మంది మనకు ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు అయితే ఫ్యాన్స్ కాదు.. ఆయనను దేవుడిగా అభిమానించే అపర భక్తులు ఉన్నారు. అయితే అంతకుమించిన ప్రేమను చూపించాడు ఒక అభిమాని. అతడి ప్రేమకు నిజంగానే జూ.ఎన్టీఆర్ సైతం ఫిదా కావాల్సిందే..

Jr NTR Fans

Jr NTR Fan Bike

జూనియర్ ఎన్టీఆర్ అభిమాని తన ఆరాధ్య హీరోపై ఎంత అభిమానం ఉందో నిరూపించారు. ఎందుకంటే ఆ అభిమాని ప్రేమ అలాంటిది మరీ.. ఒకటి కాదు.. రెండు కాదు.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 28 సినిమాల పేర్లను బైక్ పై స్టిక్కర్లుగా అంటించి.. ఆఖరుకు వెనుక లైట్లకు కూడా ఎన్టీఆర్ అని కొట్టించి మొత్తం బైక్ పైనే తన అభిమానాన్ని ఈ యువకుడు చాటుకున్నాడు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jr NTR Fans

Jr NTR

Also Read: ప్రభాస్ కు ఆనంద్‌ మహీంద్రా సాయం.. వైరల్ అవుతున్న ట్వీట్ !

హైదరాబాద్ లోని మాదాపూర్ కుమ్మరి బస్తీలో గల డీమార్ట్ సందులో ఒక ఎన్టీఆర్ అభిమాని బైక్ నిలిపి ఉంచాడు. అది చూపరులను చూపు తిప్పుకోనివ్వలేదు. అందరూ ఆ బైక్ చుట్టూ చేరి ఆసక్తిగా గమనించారు. అందులో జూ.ఎన్టీఆర్ తొలి చిత్రం స్టూడెంట్ నంబర్ 1 నుంచి నేటి ఆర్ఆర్ఆర్ మూవీ వరకూ అన్ని సినిమాల పేర్లను బైక్ పై స్టిక్కర్లుగా అంటించాడు. ఆ బైక్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. చాలా మంది ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. జూ.ఎన్టీఆర్ పై అతడికున్న అభిమానాన్ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మీరూ ఈ వీడియోలో ఆ అభిమాని ప్రేమను చూడొచ్చు.

Also Read: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

Tags