Vastu Tips మన దేశంలో వాస్తు శాస్త్రం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు తమ ఇంటి నిర్మాణంలో పక్కా వాస్తు లేనిదే నిర్మించడం లేదు. దీంతో వాస్తు విలువ అంతలా పెరిగిపోతోంది. ప్రతి ఇల్లు సుభిక్షంగా ఉండాలంటే వాస్తు నియమావళి పాటించాల్సిందే. లేదంటే అనర్థాలు చోటుచేసుకుంటాయి. ఎన్నో అశుభాలు కలుగుతాయి. దీంతో వాస్తును గట్టిగా నమ్ముతూ పద్ధతులు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు రావు. వాస్తు ప్రకారం ఇంటిలో ఏ వస్తువులు ఎక్కడ? ఎలా ఉండాలనే దానిపై వాస్తు శాస్త్రం వివరిస్తోంది.

ఇంట్లో రాకింగ్ చైర్ ఇంట్లో ఉండే దాన్ని మనకు ముందుకు వెనకకు ఊగుతూ ఉంటాం. కానీ ఖాళీ చైర్ లో ఆత్మలు కూర్చుంటాయట. అందుకే అప్పుడప్పుడు కుర్చీ కదులుతున్నట్లు అనిపిస్తుంది. అది నిజంగా ఆత్మ వచ్చి కూర్చుంటేనే అటూ ఇటు కదులుతుందని చెబుతుంటారు. మనం అనుకుంటుంటాం అది గాలికి కదులుతుందని నమ్ముతుంటాం. క్షుద్ర శక్తులు మీ ఇంట్లో నివాసం ఉంటే అంతే సంగతి. దీంతో ఇంటి వాస్తు ప్రకారం ప్రతి వస్తువును అమర్చుకోవాలి. వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలి.
ఇంటి గోడలకు గ్రీన్ పెయింటింగ్ మంచిది కాదు. ఆకుపచ్చ రంగు పిశాచాలకు ఇష్టమైనదిగా చెబుతుంటారు. అందుకే ఆకుపచ్చ రంగు వేసిన గోడలతో అరిష్టమే. ఆకుపచ్చ గోడలు తడిగా ఉన్నప్పుడు విష వాయువులను విడుదల చేస్తాయి. దీంతో ఆత్మలకు ఆయువు పట్టుగా ఆ గోడలు నిలుస్తాయనడంలో సందేహం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రీన్ గోడలు లోపల ఉండకూడదు. వాటికి కలర్ వేసేటప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేదంటే వాటితో మనకు భవిష్యత్ లో ముప్పు ఏర్పడే అవకాశాలున్నాయనడంలో సందేహం లేదు.
ఇంట్లో విరిగిన గడియారాలు ఉండకూడదు. పనికి రాని వస్తువులు కూడా ఎప్పుడు ఇంట్లో ఉంచుకోరాదు. వాటిని సాధ్యమైనంత వరకు బయట పడేయాలి. అంతేకాని లోపల దాచుకుంటే పరిస్థితి భిన్నంగా మారవచ్చు. పనికి రాని వస్తువులు ఏవైనా సరే బయట ఉంచాలి. కానీ లోపల దాచుకుంటే మనకు భంగపాటే. మురికి మంచం కూడా ఉండకూడదు. విరిగి, పనికి రాకుండా ఉన్న మంచాలు ఉంటే బయట పడేయాలి. వాస్తు ప్రకారం ఇవన్నీ ఇబ్బందులు కలిగిస్తాయి. దీంతో కొన్ని శక్తులు మనల్ని వెనకకు నెడతాయి.

గొడుగును ఇంట్లో తెరిచి ఉంచకూడదు. బయటకు వెళ్లినప్పుడు మాత్రమే తెరవాలి. ఇంట్లో తెరిస్తే ఆత్మలకు అనుకూలంగా ఉంటుందని చెబుతారు. ఇంటి ఆవరణలో ఎండిపోయిన మొక్కలు కూడా ఉంచకూడదు. ఒకవేళ ఉంటే నెగెటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు ముడతలు పడిన ఆకులు, ఎండిన కాడలు ఉన్న చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే మంచిది కాదు. ఈ వాస్తు చిట్కాలు పాటించి వాస్తు దోషాలు లేకుండా ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలుస్తోంది.