Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో భారీ అంచనాలు నెలకొల్పుతున్న సినిమా ‘హరి హర వీరమల్లు’..ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ని AM రత్నం గారు సుమారు 250 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో, హాలీవుడ్ టెక్నిషియన్స్ తో కనివిని ఎరుగని రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు..ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు గ్లిమ్స్ కి అదిరిపొయ్యే రెస్పాన్స్ వచ్చింది..అయితే కొంతకాలం నుండి ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వాళ్ళ తాత్కాలికంగా ఆగిపోయింది..కానీ ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 17 వ తారీకు నుండి తిరిగి ప్రారంభం కానుంది..దీనికి సంబంధించిన సెట్స్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ వ్యయంతో నిర్మించారు..త్వరలో ప్రారంభమయ్యే షెడ్యూల్ కి సంబంధించిన ప్రాక్టీస్ సెషన్స్ ని ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రారంభించారు..దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఆ చిత్ర సంగీత దర్శకుడు MM కీరవాణి సోషల్ మీడియా లో పోస్ట్ చెయ్యగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..పవన్ కళ్యాణ్ సరికొత్త గెటప్ చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇదంతా పక్కన పెడితే హరి హర వీరమల్లు వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 30 వ తేదీన విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..విడుదలకి ఇంకా ఎంతో సమయం ఉంది..కానీ ఇప్పటి నుండే ఈ సినిమా ప్రభంజనం ప్రారంభం అయిపోయింది..ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్ దాదాపుగా 30 కోట్ల రూపాయలకు పలుకుతుందని సమాచారం..ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమాకి #RRR రేంజ్ బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

.పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలకే అద్భుతమైన వసూళ్లు వస్తాయి..అలాంటిది పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తే ఇక ఏ రేంజ్ లో ఉంటుందో ఆ రేంజ్ ని చూపిస్తుంది హరి హర వీరమల్లు చిత్రం..ఇక బుక్ మై షో యాప్ లో అప్పుడే ఈ సినిమాకి 40 వేల ఇంట్రెస్ట్ ఓట్లు పడ్డాయి..వచ్చే ఏడాది విడుదల అవ్వబొయ్యే మిగిలిన పాన్ ఇండియన్ సినిమాలకు ఇందులో సగం కూడా లేకపోవడం విశేషం..రాబొయ్యే రోజుల్లో ఈ సినిమాకి లక్ష ఇంట్రెస్ట్ ఓట్ల మార్కుని అందుకోబోతుంది..విడుదలకి 6 నెలల ముందు ఒక సినిమాకి ఈ రేంజ్ అంటే మాములు విషయం కాదు..చూడాలి మరి భవిష్యత్తులో ఈ సినిమా ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టించబోతుందో అనేది.



[…] […]