Husband And Wife Relationship: భార్యాభర్తల మధ్య సఖ్యత ఎంతో అవసరం. అది లేకపోతే సంసారం కకావికలమే. దీనికి ఇద్దరిలో సమన్వయం ఉండాలి. సర్దుకుపోయే గుణం కావాలి. ఎవరు కోపంతో రగిలిపోయినా ఇద్దరి మధ్య అన్యోన్యత దెబ్బతింటుంది. అనవసర అపార్థాలకు తావిస్తుంది. దీంతో చక్కగా సాగాల్సిన సంసారం విడిపోయే ప్రమాదంలో పడిపోతుంది. దీనికి దంపతుల్లో సరైన అవగాహన ఉంటే సరిపోతుంది. ఒకరు కోపంగా ఉన్నప్పుడు మరొకరు మౌనం పాటిస్తే సరిపోతుంది. సంసారమనే నావ చక్కగా నడవాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. మన వివాహ వ్యవస్థను చూసే పాశ్చాత్యులు ముచ్చటపడతారు. జీవితాంతం ఒకే భాగస్వామితో ఉండటం గొప్ప విషయంగా చెబుతారు. అందుకే నాతి చరామి అనే అర్థాన్ని పుణికిపుచ్చుకుని మనం చేసే సంసారమే ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు ఇటీవల కాలంలో విడాకుల సంఖ్య పెరుగుతోంది. చిన్న చిన్న విషయాలకే కోర్టు మెట్లెక్కుతూ విడాకులు తీసుకుంటున్న వారి వల్ల మన వివాహ వ్యవస్థకే కళంకం వస్తోంది.

దంపతుల్లో కోపాలకు తావుండకూడదు. ఒకర కోపంతో ఉంటే మరొకరు మౌనం వహిస్తే సరిపోతుంది. కోపంతో ఉన్న వారికి ఎదురు చెబితే మరింత పెరుగుతుంది. అందుకే జీవిత భాగస్వామి కోపంతో ఉన్నప్పుడు మనం మౌనం వహించి వారి కోపాన్ని తగ్గించాలి. అంతేకాని మనం కూడా యక్ష ప్రశ్నలు వేస్తే పరిస్థితి చేయిదాటిపోతుంది. గొడవలకు దారి తీస్తుంది. ఫలితంగా సంసారమే సమస్యగా మారుతుంది. నిత్యం లొల్లిళ్లు ఉంటే మనశ్శాంతి కూడా కరువవుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు కోపానికి తావివ్వకండి గొడవ ముదిరేలా చేయవద్దు.
Also Read: Thank You movie Twitter Review: థాంక్యూ ట్విట్టర్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే?
ఏ సమస్య వచ్చినా దంపతులిద్దరు కలిసి పరిష్కరించుకోవాలి. సమన్వయంతో మాట్లాడుకుని సమస్యను తేలిగ్గా తీసుకోవాలి. అంతేకాని దాని గురించి తలలు పట్టుకుని ఇద్దరి మధ్య చిచ్చు పెట్టుకోకూడదు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది కానీ సమస్య మాత్రం తీరదు. సావధానంగా ఆలోచించి చక్కని పరిష్కారం కనుక్కుంటే సరిపోతుంది. దీనికి భార్యాభర్తల్లో చక్కని అన్యోన్యతతో ప్రవర్తిస్తే పరిష్కారం అదే లభిస్తుంది. కానీ ఇద్దరి మధ్య ఎలాంటి అపోహలు ఉండకుండా జాగ్రత్త వహించాలి.

ఒత్తిడితో ఆలోచిస్తే పరిష్కార మార్గాలు కనిపించవు. పైగా సమస్య పెద్దదిగా కనిపిస్తుంది. దానికి మనం ప్రశాంతంగా మనసు పెట్టి ఆలోచిస్తే పరిష్కారం అదే దొరుకుతుంది. కానీ అనవసరంగా ఆగ్రహానికి లోనైతే ఇద్దరి మధ్య ఎడం పెరుగుతుంది తప్ప పరిష్కారం కనిపించదు. ఈ నేపథ్యంలో దంపతుల్లో కోపతాపాలకు తావివ్వకుండా మనసు పెట్టి ఆలోచించి మంచి మార్గాన్ని ఎంచుకుంటే సరిపోతుంది. దీనికి గాను ఎప్పుడు ఏదో కోపంగా ఉండకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకుని ఆలోచనలు చేస్తే పరిష్కారం వస్తుంది.
Also Read:Anasuya Love Marriage : 16 ఏళ్లకే ప్రేమ.. పెళ్లి కోసం 6 ఏళ్లు వెయిటింగ్.. 11 ఏళ్ల వివాహ జీవితంపై అనసూయ సంచలన నిజాలు
Recommended Videos

