https://oktelugu.com/

Anasuya Love Marriage : 16 ఏళ్లకే ప్రేమ.. పెళ్లి కోసం 6 ఏళ్లు వెయిటింగ్.. 11 ఏళ్ల వివాహ జీవితంపై అనసూయ సంచలన నిజాలు

Anasuya Love Marriage : అటు బుల్లితెర అయినా.. ఇటు వెండితెర అయినా అందాల అనసూయ కనిపిస్తే అందరి ‘గుండె జారి గల్లంతవుతుంది’. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా అనసూయ అందచందాలు ఇంకా ‘తగ్గేదేలే’ అన్నట్టుగా ఉంటాయి. ఆమె చిలిపి నవ్వులు, చేష్టలు అందరినీ ఆకట్టుకుంటాయి. బుల్లితెరపై అంతే స్థాయిలో అందాలు ఒలకబోసే ఈ సుందరాంగి ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ కీలక పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇటీవల పుష్పలో విలన్ సునీల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 21, 2022 / 11:30 PM IST
    Follow us on

    Anasuya Love Marriage : అటు బుల్లితెర అయినా.. ఇటు వెండితెర అయినా అందాల అనసూయ కనిపిస్తే అందరి ‘గుండె జారి గల్లంతవుతుంది’. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా అనసూయ అందచందాలు ఇంకా ‘తగ్గేదేలే’ అన్నట్టుగా ఉంటాయి. ఆమె చిలిపి నవ్వులు, చేష్టలు అందరినీ ఆకట్టుకుంటాయి. బుల్లితెరపై అంతే స్థాయిలో అందాలు ఒలకబోసే ఈ సుందరాంగి ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ కీలక పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది.

    ఇటీవల పుష్పలో విలన్ సునీల్ భార్యగా అనసూయ నటించి అలరించింది. మరెన్నో సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ అటు బుల్లితెరపై యాంకర్, జడ్జిగా, ఇటు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యింది.

    ఈక్రమంలోనే తాజాగా ఈవారం జబర్ధస్త్ షోలో అనసూయ హాట్ కామెంట్స్ చేసింది. ఈ షోలోని ఎపిసోడ్ లో తన వ్యక్తి గత జీవితం గురించి పంచుకుంది. తనకు 16 ఏళ్లకే ప్రేమ ప్రపోజల్ వచ్చిందని.. తన భర్త అయిన భరద్వాజ్ బీహార్ కు చెందిన వారని.. ఆయన 16ఏళ్లకే తనను ప్రేమిస్తున్నాంటూ ప్రపోజ్ చేశాడని అనసూయ తెలిపింది. దీనికి తాను అంగీకరించి 3 ఏళ్లు ప్రేమించుకున్నామన్నారు. తన 19వ ఏట ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటే మా ప్రేమ విషయం నాన్నకు చెప్పానని.. కానీ ‘బీహార్ వాళ్లు’ అని భరద్వాజ్ ను మా నాన్న తిరస్కరించి మా పెళ్లికి ఒప్పుకోలేదని అనసూయ సంచలన విషయాలు పంచుకుంది.

    మా నాన్నను ఒప్పించడానికి తమకు 6 ఏళ్లు పట్టిందని.. తన 25వ ఏట భరద్వాజ్ తో పెళ్లికి మా నాన్న ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకున్నామని అనసూయ తెలిపింది. ఇక తన పెళ్లై 11 ఏళ్లు అవుతుందని.. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారని వివరించింది.

    ఇక తనది లవ్ మ్యారేజ్ అని.. పెళ్లికి 13మంది వచ్చారని.. కేవలం రూ.7500 మాత్రమే తన పెళ్లికి ఖర్చు అయ్యిందని జబర్ధస్త్ జడ్జి ఇంద్రజ సంచలన విషయాలను పంచుకుంది. ఇక మరో జడ్జి మనో అయితే తనకు 19 ఏళ్లకే పెళ్లి చేశారని.. తన భార్య వయసు అప్పుడు 16 ఏళ్లు అని వివరించాడు. సంపాదిస్తున్నానని చైల్డ్ మ్యారేజ్ చేశారని నవ్వులు పూయించారు.

    ఇలా ఈ వారం జబర్ధస్త్ షోలో అనసూయ, ఇంద్రజల ప్రేమ కహానీ అందరినీ అలరించింది. ముఖ్యంగా అనసూయ తన ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లడానికి ఐదేళ్లు సమయం పట్టిందని తన లవ్ స్టోరీని పంచుకుంది.