Megastar Chiranjeevi: తెలుగు సినీ పరిశ్రమలో స్వయంకృషితో ఎదిగిన నటుడు చిరంజీవి. తన స్వశక్తితో ఇండస్ట్రీని ఊపేసిన దీరుడు. అంతేకాదు మెగాస్టార్ బిరుదు అందుకుని తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అసలు చిరంజీవికి మెగాస్టార్ బిరుదు రావడానికి కారకులు ఎవరు? ఆయనకు గాడ్ ఫాదర్ లాంటి దర్శకుడు, నిర్మాత ఉన్నారు. వారి సహకారంతోనే చిరుకు గుర్తింపు దక్కింది. చిరంజీవిని మెగాస్టార్ ను చేసింది కూడా వారే కావడం గమనార్హం. చిరంజీవితో ఎందరో సినిమాలు చేసినా హిట్ చిత్రాలు తీసింది మాత్రం దర్శకుడు కోదండరామిరెడ్డి. ఆయన ప్రోద్బలంతోనే చిరంజీవి స్టార్ గా ఎదిగారు. ఆయన దర్శకత్వంలోనే ఎక్కువ హిట్లు వచ్చాయి.
వీరి కలయికలో యండమూరి వీరేంద్రనాథ్ నవలల ఆధారంగా దాదాపు 12 చిత్రాలు వచ్చాయి. అందులో అన్ని బ్రహ్మాండమైన చిత్రాలే. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ అధినేత కేఎస్ రామారావు నిర్మాతగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా అభిలాష. ఇది సూపర్ డూపర్ హిట్. తరువాత వీరి కలయికలో వచ్చిన మరో చిత్రం రాక్షసుడు. ఇది కూడా టాలీవుడ్ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. ఇందులో నాగబాబు తొలిసారి నటుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాతో చిరంజీవి రేంజ్ ఎక్కడకో వెళ్లిపోయింది.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ షాకింగ్ నిర్ణయం.. బాధలో టాలెంటెడ్ డైరెక్టర్
తరువాత వీరి ముగ్గురి కలయికలో వచ్చిన మరో సినిమా ఛాలెంజ్. ఇది కూడా బ్రహ్మాండమైన హిట్. చిన్న కథతో పెద్ద హిట్ సాధించారు. దీంతో చిరంజీవికి మరింత ఊపు వచ్చింది. ఇందులో విజయశాంతి, సుహాసిని చిరంజీవికి జోడిగా నటించారు. వీరి ఆధ్వర్యంలో వచ్చిన మరో చిత్రరం మరణమృదంగం. ఈ సినిమాలోనే చిరంజీవి పేరు ముందు మెగాస్టార్ చేర్చారు కేఎస్ రామారావు. సో చిరంజీవికి మెగాస్టార్ బిరుదు రావడానికి కారకులు కేఎస్ రామారావు. ఇలా చిరంజీవికి బ్యాక్ బోన్ గా నిలిచి ఆయనకు సక్సెస్ లు సాధించిన నిర్మాతగా ఆయన పేరు చిరస్థాయిగా నిలుస్తుంది. కానీ ఈ సినిమా కూడా ఫెయిల్ సినిమాగానే నిలిచింది. దీంతో మెగాస్టార్ గా పేరు తెచ్చినా సినిమా మాత్రం సక్సెస్ కాకపోవడం విచిత్రమే.
ఇక వీరి నేతృత్వంలో వచ్చిన చివరి చిత్రం స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్. ఇందులో విజయశాంతి, నిరోషా హీరోయిన్లుగా నటించారు. చిత్రం సక్సెస్ కాలేకపోయినా చిరంజీవికి మాత్రం పేరు తెచ్చింది. చిరంజీవి చేసిన ప్లాప్ సినిమాల్లో ఇదొకటి కావడం గమనార్హం. ఇలా కేఎస్ రామారావు చిరంజీవికి సక్సెస్ లు అందించిన నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా దర్శకుల్లో కూడా కోదండరామిరెడ్డి లేకపోతే చిరంజీవి ఉండేవాడు కాదేమో అనిపిస్తుంది. అంతటి హిట్లు ఇచ్చిన డైరెక్టర్ గా కోదండరామిరెడ్డిని అందరు ప్రశంసిస్తారు. ఇక క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో ప్రస్తుతం చిరంజీవి మరో సినిమాలో నటిస్తున్నాడు. దానిపేరు భోళాశంకర్. దర్శకుడు మెహర్ రమేష్. దీనికి సంబంధించిన చిత్రీకరణ వేగంగా సాగుతోంది. దసరాకు సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read:Koratala Siva: షాకింగ్ నిర్ణయం తీసుకున్న కొరటాల శివ.. కారణం అదే