Husband and wife are employees : ప్రస్తుతం అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో ఎవరి ఆఫీస్ పనుల్లో వాళ్లు బిజీగా ఉంటున్నారు. రోజంతా ఇంట్లో పని, ఆఫీస్ వర్క్ తోనే సగం సమయం అయిపోతుంది. అసలు భాగస్వామితో కాస్త టైం కూడా స్పెండ్ చేయరు. భార్యాభర్తల బంధం మెరుగ్గా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. భాగస్వామితో రోజు కొంత సమయం గడపాలి. ఎంత బిజీగా ఉన్నా.. టైం సెట్ చేసుకోవాలి. అప్పుడే బంధం ఇంకా బలపడుతుంది. లేకపోతే ఇద్దరి మధ్య గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. అన్ని విషయాలు లైఫ్ లో అర్ధం చేసుకుని భాగస్వామిలు ఉండాలి. అయితే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు అయితే ఇలాంటి విషయాల్లో చిన్న గొడవలు వస్తాయి. మరి ఎలాంటి గొడవలు రాకుండా ఉండాలంటే పాటించాల్సిన నియమాలు ఏంటో మరి చూద్దాం.
మొబైల్ దూరంగా ఉండండి
ఈరోజుల్లో చాలా మంది ఎక్కువగా మొబైల్స్ వాడుతున్నారు. వీటికి బాగా ఎడిక్ట్ అయి.. ఎవరిని పట్టించుకోకుండా ఉంటున్నారు. రోజంతా ఎంత బిజీ గా ఉన్న.. కాస్త ఫ్రీ టైం దొరికితే మొబైల్ వాడుతున్నారు. దీని మైకంలో పడి భాగస్వామికి టైం ఇవ్వడం లేదు. ఆఖరికి భాగస్వామితో ఉన్నప్పుడు కూడా కొందరు మొబైల్ వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. కాబట్టి భాగస్వామితో కాస్త టైం స్పెండ్ చేస్తే.. బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది.
కలిసి బయటకు వెళ్లండి
భార్యాభర్తలు ఇద్దరూ కలిసి అప్పుడప్పుడు వెకేషన్ కి వెళ్లండి. సమయం లేకపోయినా సెట్ చేసుకుని కొత్త ప్రదేశాలకు వెళ్లండి. ఇలా ఇద్దరూ కలిసి టైం స్పెండ్ చేయడం వల్ల బంధం బలపడుతుంది.
కలిసి పనులు చేయండి
భాగస్వామి ఇంట్లో ఏదయినా పని చేస్తే.. సాయం చేయండి. మీకు పని చేయడం ఇష్టం లేకపోతే తన పక్కన ఉండి మాట్లాడండి. అప్పుడు ఇద్దరి మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. ఇలా టైం స్పెండ్ చేస్తుంటే.. మీ వర్క్ విషయంలో కూడా ప్రాబ్లెమ్ రాదు.
ఒకే సమయానికి లేవండి
వర్క్ బిజీలో టైం ఉండటం లేదు అంటే.. ఇద్దరూ కూడా ఒకే సమయానికి నిద్ర లేచి, పడుకుంటే టైం గడిపినట్లు అవుతుంది. పడుకునే ముందు మొబైల్ చూడకుండా ఆమెతో మాట్లాడితే బంధం ఇంకా పెరుగుతుంది.
ఏ టైం లో మాట్లాడాలో ముందే ప్లాన్ చేసుకోండి
ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా.. ఏ సమయంలో ఏం చేయాలి అని ముందే ప్లాన్ చేసుకోండి. లంచ్ టైం, బ్రేక్ టైం లో భాగస్వామితో కాస్త మాట్లాడటం వంటివి చేస్తే.. సమయం గడిపినట్టు ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య గొడవలు రావు. సంతోషంగా ఉంటారు.