Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వ్యాపారులు అనుకోని ఆదాయం పొందుతారు. అయితేమరికొన్ని రాశుల వారు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు చంద్రుడు కుంభ రాశిలో ప్రయాణం చేయనున్నారు. మొత్తం 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
అవసరాలకు తగిన ఆదాయం లభిస్తుంది. జీవిత భాగస్వామితో డబ్బు విషయంలో వాగ్వాదం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొత్త వారితో స్నేహం చేసేటప్పుడు ఆలోచించాలి.
వృషభ రాశి:
ఆస్తుల కోనుగోలుపై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనుకునేవారు ఇతరుల సలహా తీసుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
మిథున రాశి:
కొన్ని విషయాల్లో వివాదాలు ఎదుర్కొంటారు. అనైతిక పనులకు దూరంగా ఉండాలి. మానసికంగా ఆందోళనతో ఉంటారు. ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువ. సోమరితనం కారణంగా కొన్ని పనులు పూర్తి చేయలేరు.
కర్కాటక రాశి:
వ్యాపార ఆదాయం అనేక రేట్లు పెరుగుతుంది. జీవిత భాగస్వామితో వివాదం ఏర్పడుతుంది. ఉద్యోగులు తోటివారితో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి.
సింహారాశి:
ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కొన్ని విషయాల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆకస్మికంగా లాభాలు రావడంతో ఉత్సాహం పెరుగుతుంది. వాహనాలపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.
కన్య రాశి:
ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థికంగా అధిక ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. రోజువారీ కంటే ఈరోజు ఎక్కువగా లాభాలు ఉంటాయి. సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు.
తుల రాశి:
వ్యాపారులు అనుకోని లాభాలుపొందుతారు. భవిష్యత్ కోసం పెద్ద ప్రణాళికే వేస్తారు. మీ తెలివి ప్రదర్శనతో కార్యాలయంలో ప్రశంసలు దక్కుతాయి. ఆధ్యాత్మిక కేంద్రాలకు పర్యటనలు చేస్తారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు.
వృశ్చిక రాశి:
వ్యాపారులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ప్రవర్తన విషయంలో కీలకంగా వ్యవహరించాలి. ఈరోజు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు పని ప్రదేశంలో ప్రశంసలు అందుకుంటారు.
ధనస్సు రాశి:
వ్యాపారులకు కొంత నష్టం ఉండే అవకాశం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. పాత స్నేహితులను కలుస్తారు. కటుుంబ సభ్యులతో ప్రశాంతంగా కనిపిస్తారు.
మకర రాశి:
ఏదైనా వివాదామైన పనులు ఉంటే వాయిదా వేసుకోవడమే మంచిది. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం బలహీనంగా మారే అవకాశాలు ఎక్కువ. ఉద్యోగులు మిశ్రమ ఫలితాలు పొందుతారు.
కుంభరాశి:
కొన్ని సమస్యలను అధిగమించుతారు. శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రత్యర్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు అధిక లాభాలు పొందే అవకాశం. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వీడాలి.
మీనరాశి:
ప్రతి పనిలో విజయం ఉంటుంది. ఉద్యోగులు ఉల్లాసమైన వాతావరణంలో ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఆర్థికపరమైన లాభాలు ఉంటాయి.