https://oktelugu.com/

Heart Attack : గుండెపోటు ఎక్కువగా వచ్చేది.. ఏ బ్లడ్ గ్రూపు వాళ్లకో మీకు తెలుసా?

మీ బ్లడ్ గ్రూప్ ను బట్టి మీకు వచ్చే అనారోగ్య సమస్యలు తెలుసుకోవచ్చు. మరి ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఈరోజు మన స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం.

Written By:
  • Srinivas
  • , Updated On : September 15, 2024 1:33 pm
    Heart Attack

    Heart Attack

    Follow us on

    Heart Attack :  బ్లడ్ గ్రూప్ ల గురించి అందరికీ తెలిసిందే. మొత్తం 8 రకాల బ్లడ్ గ్రూప్ లు ఉన్నాయి. అయితే ఒక్కో బ్లడ్ గ్రూప్ బట్టి వ్యక్తిత్వం ఉంటుందని చాలా మంది అంటుంటారు. వాళ్ల బ్లడ్ బట్టి ప్రవర్తిస్తుంటారు. అయితే బ్లడ్ గ్రూప్ లు అనేవి కేవలం ఇలా వ్యక్తిత్వం తెలుసుకోవడానికి దానం చేయడానికి మాత్రమే కాకుండా.. అనారోగ్య సమస్యలను కూడా చెబుతాయి. మీ బ్లడ్ గ్రూప్ ను బట్టి మీకు వచ్చే అనారోగ్య సమస్యలు తెలుసుకోవచ్చు. మరి ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఈరోజు మన స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం.

    గుండె సమస్యలు
    ఈ రోజుల్లో చాలా మందికి గుండెపోటు ఎక్కువగా వస్తుంది. అయితే O బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్లకి గుండెపోటు వచ్చే ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయి. మిగతా బ్లడ్ గ్రూప్ లు అయిన A, B, AB వాళ్లకి కొరోనరీ హార్ట్ డిసీజ్ ఎక్కువగా వచ్చే ముప్పు ఉంది. O బ్లడ్‌ గ్రూప్‌ వాళ్లకి ఎక్కువగా కొలెస్ట్రాల్, కడుపు సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి.

    పెప్టిక్ అల్సర్
    ఆప్టికల్చర్ అంటే కడుపులో లేదా పేగు లైనింగ్ దగ్గర వచ్చే చిన్న పుండు. అయితే ఇది ఎక్కువగా ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్లకి వస్తుంది. కాబట్టి ఏ చిన్న లక్షణం కనిపించిన వెంటనే డాక్టర్ ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

    క్యాన్సర్
    క్యాన్సర్ ఉంటే వ్యాధులు ఎక్కువగా A, AB, B బ్లడ్ గ్రూప్‌ ఉన్నవాళ్లకి ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా ఫైలోరీ ఇన్ఫెక్షన్ A బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే పెద్దపెద్ద క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదం కూడా A బ్లడ్ గ్రూప్ వాళ్లకి ఎక్కువగా ఉంది.

    ఒత్తిడి
    సాధారణంగా సమస్యలు ఏమైనా వస్తే ఒత్తిడికి గురవుతారు. అదే సమస్య చిన్నదా, పెద్దదా అనే దాన్ని బట్టి కొందరు ఒత్తిడికి గురవుతుంటారు. అయితే A బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు చిన్న విషయానికి కూడా ఒత్తిడికి గురవుతారు.

    వెయిన్స్‌ త్రాంబోఎంబోలిజం
    కొంతమందికి కాళ్ల వేయిన్స్ లో రక్తం గడ్డ కడుతుంది. దీనినే వెయిన్స్‌ త్రాంబోఎంబోలిజం
    అంటారు. అయితే ఇది ఎక్కువగా A , B, AB బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లకి వస్తుంది. ఈ సమస్యకు వెంటనే చికిత్స చేయాలి. లేకపోతే ఊపిరితిత్తులకు చేరే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    షుగర్
    ప్రస్తుతం చాలా మందికి షుగర్ వస్తుంది. అయితే డయాబెటిస్‌ ఎక్కువగా A, B బ్లడ్‌ గ్రూప్‌ ఉన్నవాళ్లకి వస్తుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.