
Sweat: వేసవి కాలంలో చెమట పట్టడం సాదారణమే. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. మన ఆహార అలవాట్లు, జీవన శైలి చెమటలు పట్టేలా చేస్తాయి. ఈ నేపథ్యంలో మన ఆహార అలవాట్లు మార్చుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఈ నేపథ్యంలో మన ఆహార అలవాట్లలో మార్పులు చేసుకుంటే కచ్చితంగా చెమట నుంచి దూరం కావచ్చు. దీనికి గాను మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
నీరు ఎక్కువగా తాగాలి
ఎండాలంలో మన శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దీంతో శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. తద్వారా వడదెబ్బ సోకే ప్రమాదం ఉంటుంది. మంచినీళ్లు ఎక్కువగా తాగితే మనకు ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. వేసవిలో కనీసం ఐదారు లీటర్ల నీరు తాగడం వల్ల మనకు కష్టాలు రాకుండా ఉంటాయి. శరీరం చల్లదనంగా ఉండేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.

మసాలాలు వద్దు
ఈ కాలంలో మాంసాహారాల్లో మసాలాలు వేసుకుంటే వేడి ఎక్కువ అవుతుంది. దీంతో చెమట పట్టడం ఖాయం. ఇంకా కూరల్లో కారం ఎక్కువగా వాడకూడదు. కారంతో మనకు చెమట ప్రభావం పెరుగుతుంది. దీంతో రోజంతా చెమటతో ఇబ్బందులు ఎదుర్కొంటాం. సాధ్యమైనంత వరకు మసాలాలు, కారాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం.
కెఫిన్ కు దూరంగా..
ప్రస్తుత కాలంలో కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. ఇందులో ఉండే కెఫిన్ తో మనకు ఇబ్బందులు వస్తాయి. శరీరంలో వేడి పెరుగుతుంది. తద్వారా సమస్యల్లో ఇరుక్కుంటాం. అందుకే ఈ కాలంలో కాఫీ, టీలు ముట్టుకోకపోతేనే లాభం. చెమట కంపు నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇలా ఎండాకాలంలో చెమట పట్టకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటే ప్రయోజనం కలుగుతుంది.