Homeట్రెండింగ్ న్యూస్Relationships : ఇతరులతో సంబంధాలు పెట్టుకున్న పురుషులు ఎలా ఉంటారో తెలుసా?

Relationships : ఇతరులతో సంబంధాలు పెట్టుకున్న పురుషులు ఎలా ఉంటారో తెలుసా?

Extra Marital Affairs
Extra Marital Affairs

Relationships : ప్రస్తుత రోజుల్లో వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. తాళి కట్టిన ఆలిని కాదని వేరొకరితో సంబంధం పెట్టుకుంటున్నారు. దీంతో సంసారంలో కలతలు వస్తాయని తెలిసినా మానడం లేదు. ఈ నేపథ్యంలో భార్య కన్నా ప్రియురాలికే ప్రాధాన్యం ఇస్తుంటారు. ఆమెను అన్ని విధాలుగా ఆదుకుంటారు. ఏ కష్టమొచ్చినా అండగా నిలబడతారు. ఆమెనే సర్వస్వం అనే ధోరణిలో వారి ప్రవర్తన ఉంటుంది.

వివాహేతర సంబంధాన్ని రహస్యంగా ఉంచుకుంటారు. ఎవరికి తెలియవద్దని చాలా జాగ్రత్తలు తీసుకున్నా అది బహిరంగ రహస్యమే. అందరికి తెలిసిపోతుంది. చివరకు కట్టుకున్న భార్యకు కూడా తెలుస్తుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు రాజేసుకుంటాయి. దాంతో తిరగడం మానేస్తావా లేదా అని శ్రీమతి షరతు పెట్టినా దానికి ససేమిరా అంటారు కానీ ఆమెను మాత్రం వదులుకోరు.

Extra Marital Affairs
Extra Marital Affairs

ఈ నేపథ్యంలో ఆత్మహత్యలు చేసుకోవడం, హత్యలకు దారితీసే సందర్భాలు సైతం అనేకం ఉన్నాయి. తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందనే నెపంతో భార్యను చంపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తమ బంధానికి అడ్డుగా నిలిచాడనే నెపంతో భర్తను అడ్డు తొలగించుకున్న హత్యలు కూడా ఉన్నాయి. ఇలా వివాహేతర సంబంధాలతో ఎందరో చాలా రకాలుగా బాధలు అనుభవిస్తున్నారు.

ఎన్ని గొడవలు జరిగినా వారి ప్రేమాయణం మాత్రం ఆగదు. రహస్యంగా కలుసుకుంటూ తమ ప్రేమ కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉంటారు. ఎవరెన్ని చెప్పినా తమ బంధం శాశ్వతం అనే కోణంలోనే వారి ఆలోచనలు ఉండటం గమనార్హం. దీంతో వివాహేతర సంబంధాల నెపంతో రోజుకు ఎన్నో తగాదాలు జరుగుతున్న మాట వాస్తవమే.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version