Poverty: జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలని ఎవరికైనా ఉంటుంది. అయితే అందరూ ఒకే రూట్లో కాకుండా వారికి నచ్చిన దారి వెంట వెళ్తూ డబ్బులు సంపాదిస్తారు. కొందరికి ఉద్యోగం చేయడం అంటే చాలా ఇష్టం. నన్ను ఎలా డబ్బులు సంపాదిస్తూ ఉండడంవల్ల ప్రశాంతంగా ఉండవచ్చని భావిస్తారు. మరికొందరు వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనుకుంటారు. ఎవరు ఎలా డబ్బు సంపాదించినా కొందరిలో ఎప్పటికీ పేదరికం నిలిచే ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నించినా ఆర్థికంగా స్థిరపడలేరు. అయితే తమ అదృష్టం బాగాలేదని అనుకుంటారు. కానీ అలా కాకుండా తాము పేదరికంలో ఉన్నామని భావిస్తే కొన్ని ప్రణాళికలు వేసుకోవడం వల్ల ఈజీగా ఆర్థిక సమస్యల నుంచి బయట పడవచ్చని కొందరు వ్యాపారాన్ని పనులు తెలుపుతున్నారు. ఆ ప్రణాళికలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
పేదరికం నుంచి బయటపడాలని అనుకునే వారు వారి కంటే ఎక్కువగా డబ్బు సంపాదించే వారి గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. వారు ఎలా డబ్బు సంపాదించారు.. ఆర్థికంగా స్థిరపడానికి వారు ఎలాంటి ప్రయత్నాలు చేశారు.. అనే విషయాలను తెలుసుకోవాలి. ఒకవేళ వారి జీవితం మీ జీవితంతో సమానంగా ఉంటే వారు చేసే పనులు కూడా మీరు చేయవచ్చు. అయితే వీరి కంటే తక్కువ ఆదాయం ఉన్న వారిని కలవడం వల్ల మీరు డబ్బు సంపాదించలేరు.
పేదరికం నుంచి బయటపడడానికి డబ్బు సంపాదించే మార్గాలను వెతుక్కోవాలి. కొందరు తమ ఇంటికి ఉపాధి వస్తుందని అనుకుంటూ ఉంటారు. ఇంకొందరు తమకు అదృష్టం వచ్చిన తర్వాతే డబ్బు సంపాదించాలని అనుకుంటారు. కానీ అవకాశాలు ఇంటి దగ్గరికి రావు.. వాటిని సృష్టించుకోవాలని కొందరు చెబుతూ ఉంటారు. అందువల్ల ఉపాధి కోసం వివిధ మార్గాలలో వెళ్తూ ఉండాలి. ఏది సరైనదో ఎంచుకొని వాటి మార్గం గుండా పయనించాలి.
డబ్బు సంపాదించడం చాలామంది చేస్తారు.. కానీ దానిని రెట్టింపు చేయడంలో చాలామంది పొరపాట్లు చేస్తారు. అంటే కొందరు సాంప్రదాయంగా డబ్బు సంపాదిస్తూ వాటిని ఖర్చు పెడుతూ మిగతా మొత్తాన్ని సేవింగ్స్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా సేవ్ చేస్తూ పోవడం వల్ల సంవత్సరాలు గడిచిన ఆదాయం రెట్టింపు కాదు. ఈ సేవింగ్స్ లో కొంత భాగం ఇతర పెట్టుబడులో పెట్టాలి.ఇలా చేయడం వల్ల ఎక్కడో చోట లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా డబ్బు రెట్టింపు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇవి ఖర్చులు, ఇంకా చెల్లింపులు ఫోను మిగిలిన వాటితో చేయాలి. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టడం వల్ల తిరిగి మళ్ళీ నష్టపోయే అవకాశం ఉంటుంది.
అందరూ డబ్బు సంపాదించాలని అనుకుంటారు. కానీ సులభంగా సంపాదించాలని మార్గాలు వెతుకుతారు. ఇలా చేయడం వల్ల ఎప్పటికైనా వ్యర్థమే అని కొందరు ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. నిరంతరం కష్టపడుతూ సమయాన్ని వృధా చేయకుండా డబ్బు సంపాదించడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అంతేకాకుండా ఖర్చులను తగ్గిస్తూ వ్యసనాల పారిన పడకుండా ఉండాలి. అప్పుడే ఆర్థిక అభివృద్ధి జరిగి పేదరికం నుంచి బయటపడతారు.