Ugadi Rasi Phalalu 2025: తెలుగు క్యాలెండర్ ప్రకారం.. 2025 మార్చి 30 నుంచి తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇదే రోజు ఉగాది పండుగ కూడా ఉండడంతో తెలుగు వారంతా ఈ పర్వదినాన్ని నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యారు. ఉగాది పండుగ సందర్భంగా సూర్యుడు శనితో కలిసి మీనరాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని రాశులపై ప్రభావం పడనుంది. అయితే ఈ సమయంలో కొన్ని రాశుల వారు అదృష్టాన్ని తెచ్చుకోగలుగుతున్నారు. అంతేకాకుండా వారి జీవితాల్లో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరో చూద్దాం..
మార్చి 30 నుంచి విశ్వా వసు సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా మకర రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. అయితే మొదట్లో వీరికి కొన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా సంపద పెరుగుతుంది. కొన్నాళ్లపాటు ఆర్థిక సమస్యలు ఉండి.. ఆ తర్వాత సర్దుకుంటాయి. కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగులు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.
కన్య రాశి వారికి కొత్త ఏడాదిలో కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో వ్యాపారులు అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. దీంతో పదోన్నతులు తిరిగి అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.
ధనుస్సు రాశి వారికి కొత్త ఏడాది శుభ ఫలితాలు తీసుకురానుంది. ఈ రాశిలో గురు సంచారం కారణంగా కొన్ని అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. పెండింగ్లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో కలిసి యాత్రలకు వెళ్తారు. సొంత వాహనాలపై ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తోటి వారి సాయం కారణంగా అప్పులు తీరుతాయి. జీవితంలో ఆర్థికంగా స్థిరపడతారు.
వృషభ రాశి వారికి కొత్త సంవత్సరం అన్ని పనుల్లో విజయం చేకూరాలని ఉంది. గతంలో ఏర్పాటు చేసుకున్న కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులపై ఫోకస్ పెడతారు. కొత్త భాగస్వాములు పరిచయం కావడంతో వ్యాపార అభివృద్ధి సాగుతుంది. ఉద్యోగులు తోటి వారి సాయంతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. రాజకీయ నాయకులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి.
మిథున రాశి వారికి శని గురు సంచారాలు అనుకూల ఫలితాలు కలగజేస్తాయి. ఉద్యోగం కోసం ఎదురుచూసేవారు శుభవార్తలు వింటారు. వ్యాపారులు అధిక లాభాలను పొందుతారు. ప్రియమైన వారితో కలిసి ప్రయాణాలు చేస్తారు. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.. అయితే ఈ ప్రయాణాలు వ్యాపారులకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు.