kites: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాలు అందంగా ముస్తాబవుతాయి. పిండి వంటలు, ముగ్గులు, గంగిరెద్దుల విన్యాసాలతో పాటు ఆంధ్రాలో కోడి పందాలు జోరుగా సాగుతుంటాయి. ప్రతీయేడు ఇవి లేకుంటే అసలు సంక్రాంతి పండుగకు అర్థం లేదని కొందరు వాదిస్తుంటారు. ఇక చిన్నారులు అయితే గాలి పటాలు ఎగరేస్తూ చాలా ఆనందంగా గడుపుతుంటారు. గాలిపటాలు ఎగురవేసేందుకు చిన్నారులతో పాటు పెద్దలు కూడా ఉత్సాహం చూపిస్తుంటారు. కైట్స్ ఎగురవేయడంతో పాటు వేర్ గాలిపటాలను కట్ చేయడంలో ఉన్న మజా అంతా ఇంతా కాదని చెబుతున్నారు కొందరు.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో మార్కెట్లో విభిన్న రకాల గాలిపటాలు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్‌లో గాలిపటాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకే ప్రతీ ఏడు ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది మాత్రం కరోనా కారణంగా కైట్ ఫెస్టివల్ రద్దు చేసినట్టు తెలుస్తోంది. సాధారణంగా గాలిపటాల పండుగ జరిగిన సమయంలో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు సైతం ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటుంటారు.
Also Read: జగన్ తో చిరు లంచ్ భేటి.. ఎవరికి ‘స్ట్రోక్’ తగలనుంది?
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కొవిడ్ కేసులు మరోసారి వేగంగా విజృంభిస్తున్నాయి. ప్రభుత్వాలు ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటూ పండుగలు జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి. దీంతో చిన్నారులు గాలిపటాలను కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్దకు క్యూ కట్టారు. ప్రధానంగా నగరంలోని ధూల్ పేట, గుల్జార్ హౌస్, చార్మినార్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలలో పతంగుల దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరారు. ఈ ఏడాది కరోనా గాలిపటాలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి.
చాలా మంది వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రెండ్రోజుల ముందు నుంచే దుకాణాలన్నీ కలకలలాడుతున్నాయి. పిల్లలు కొవిడ్ బారిన పడకుండా ఉండేందుకు పెద్దలే దుకాణాల వద్దకు వెళ్లి పతంగులు తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. నగరంలోని ధూల్‌పేటలో పతంగులను కొనుగోలు చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం మార్కెట్లో ఒక రూపాయి మొదలుకుని 500 రూపాయల వరకు గాలిపటాల ధరలు ఉన్నాయి.
[…] […]