AP Movie Ticket Price Issue: మెగాస్టార్ చిరంజీవి ఏపీలో థియేటర్లు, టికెట్ రేట్ల వ్యవహారం పై చర్చించడానికి నేడు జగన్ తో భేటీ అవుతున్నారు. కాగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవిని మీడియా చుట్టుముట్టగా.. ‘తాను సీఎం ఆహ్వానం మేరకు సినీ పరిశ్రమ పెద్దగా వచ్చాను అని’ చిరంజీవి చెప్పుకొచ్చారు. అనంతరం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి చిరంజీవి బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని చిరు కలిశారు.

వారిద్దరూ కాసేపట్లో కలిసి లంచ్ చేయనున్నారు. లంచ్ తర్వాత 15 నిమిషాల పాటు ఇద్దరు చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా భేటీ అవుతుండటం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమా వాళ్ళ పై వైసీపీ నాయకులు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలని కూడా చిరు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లనున్నారని, అలాగే గత కొంత కాలంగా చిత్ర పరిశ్రమలో ఏపీలో ఎదుర్కొంటున్న సమస్యలను కూడా చిరు వివరించనున్నారని తెలుస్తోంది.
Also Read: సినిమా టికెట్ల లొల్లి ముగిసేనా? చిరంజీవికి జగన్ పిలుపు
వీరి మధ్య చర్చ పూర్తి అయిన తర్వాత వైఎస్ జగన్ ఎలాంటి ప్రకటన చేస్తాడో ? చూడాలి. మరోపక్క వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, టికెట్ రేట్ల సమస్య పై చాలా వివరణ ఇవ్వడం, చిరు కూడా ఎప్పటి నుంచో అడుగుతూ ఉండటం చేత టికెట్ల రేట్ల విషయంలో సినిమా జననానికి ఏమైనా మేలు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నాడా ? చూడాలి. ఒకవేళ సినిమా పరిశ్రమకు మేలు జరిగేలా జగన్ నిర్ణయం తీసుకుంటే ఆ క్రెడిట్ చిరుకే దక్కుతుంది.
Also Read: చిరంజీవిని తొక్కామని సంబరపడి.. తెలుగు ఇండస్ట్రీని ముంచేశారు?