Job Search: ప్రపంచమంతా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉంది. చాలామంది ఏదైనా సమాచారం కావాలంటే గూగుల్ లోకి వెళ్లి సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లోకి Artificial Intelligence(AI) ఎంట్రీ ఇస్తోంది. దీంతో చాలామంది ఏఐ గురించి తెలుసుకుంటున్నారు. ఏఐ పూర్తిగా అందుబాటులోకి వస్తే ఉద్యోగాలు ఊడుతాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొన్ని సంస్థల్లో ఏఐని ఉపయోగించి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఏఐ ఉద్యోగాలను ఊడగొట్టడమే కాదు.. జాబ్ లేనివారికి ఉద్యోగాన్ని ఇచ్చేందుకు రెడీ అయింది. ఇంతకీ ఏఐ ద్వారా ఎలా ఉద్యోగాలను పొందవచ్చు? అందుకు మార్గం ఏంటి?
ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని రకాల సాఫ్ట్వేర్లు వినియోగంలోకి వచ్చాయి. వీటిలో Perplexity బాగా ప్రాచుర్యం పొందుతోంది. అయితే ఇప్పటివరకు Perplexity గురించి కేవలం సమాచారం తీసుకోవడం అని మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఉద్యోగాలను కూడా తెచ్చిపెట్టే సాఫ్ట్వేర్ గా ఉపయోగపడుతోంది. Perplexity రిజిస్టర్ అయిన తర్వాత Commet అనే బ్రౌజర్ ఇన్స్టాల్ చేసుకోమని మెయిల్ వస్తుంది. ఒకవేళ ఇది మెయిల్ లోకి రాకపోయినా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే దీనిని మొబైల్ లేదా డెస్క్ టాప్, లాప్ టాప్ లలో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది బ్రౌజర్ల పని చేస్తుంది. అంటే గూగుల్ లో ఎలా సెర్చ్ చేస్తామో.. దీని ద్వారా కూడా కావలసిన సమాచారం సెర్చ్ చేసుకోవచ్చు. అయితే ఇది కేవలం సెర్చ్ ఇంజన్ మాత్రమే కాకుండా నిరుద్యోగులకు వరంగా మారింది.
Perplexity Commet బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన Assistant అనే ఆప్షన్ కనిపిస్తుంది. అంటే ఇది ఒక నిరుద్యోగికి స్నేహితుడి లాగా పనిచేస్తుంది. దీనిని ఓపెన్ చేసిన తర్వాత అందులో ఒక Prompt ఇవ్వాలి. అంటే మీరు ఏదైతే ఉద్యోగాని కోసం వెతుకుతున్నారో.. దానికి సంబంధించిన వివరాలతో కూడిన రెస్యూమ్ ను Assistant అనే ఆప్షన్ లో అప్లోడ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఎక్కడైతే అప్లోడ్ చేసినా వ్యక్తికి కావాల్సిన జాబ్స్ ఉన్నాయో వాటిని వెతికి ముందు ఉంచుతుంది. అలాగే అప్లోడ్ చేసిన వ్యక్తికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయో వాటి వివరాలను వివిధ కంపెనీలకు తెలిపి ఇద్దరి మధ్య కమ్యూనికేటర్ గా పనిచేస్తుంది. అంటే నిరుద్యోగులకు కావలసిన ఉద్యోగాన్ని దీని ద్వారా వెతుక్కోవచ్చు.
ఇప్పటివరకు ఏఐ అంటే భయపడేవారు ఇప్పుడు దీని ద్వారా కావలసిన ఉద్యోగాలను పొందేందుకు ప్రయత్నించవచ్చు. అయితే ప్రస్తుతానికి ఒక కంపెనీకి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నా పర్సన్ కావాలో అందుకు సంబంధించిన స్కిల్స్ నేర్చుకొని ఉండాలి. ఆ స్కిల్స్ కనుక కంపెనీకి నచ్చితే మీకు కచ్చితంగా కాల్ వస్తుంది. అప్పుడు ఇంటర్వ్యూ లేదా నేరుగా జాబ్ లోకి జాయిన్ కావచ్చు. ఇలా Commet లోని Assistant అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇందుకోసం ముందుగా లాప్ టాప్ లేదా మొబైల్లో Commet బ్రౌజర్ ను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.